కొత్త ఆర్థిక సంవత్సరంలో మారుతి కార్లు సరికొత్త ధరల్లో లభిస్తున్నాయి… కాబట్టి కొత్తకారు కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. ఏ కారు ఎంత తగ్గింపు ధరకు లభిస్తుందో తెలుసా..?
ఏప్రిల్ 2026 నెలలో మారుతి సుజుకి తన ఎరీనా డీలర్‌షిప్‌ల ద్వారా పలు కార్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఈ ఆఫర్లలో భాగంగా మొత్తం రూ.45,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ఆఫర్, కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నగరం, డీలర్‌షిప్‌ను బట్టి ఈ ఆఫర్లలో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు.
25
Maruti Alto K10, SPresso
ఈ ఆఫర్ల జాబితాలో మారుతి ఆల్టో కే10, మారుతి ఎస్-ప్రెస్సో వంటి ఎకానమీ కార్లు ముందున్నాయి. ఆల్టో కే10 మోడల్‌పై గరిష్ఠంగా రూ.37,500 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. ఇందులో క్యాష్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉన్నాయి. మొదటిసారి కారు కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇక ఎస్-ప్రెస్సో మోడల్‌పై కూడా రూ.37,500 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
35
Maruti WagonR, Celerio
ఈ జాబితాలో మారుతి వ్యాగన్ఆర్, మారుతి సెలెరియో కార్లు అమ్మకాల్లో ఎప్పుడూ ముందుంటాయి. వ్యాగన్ఆర్‌పై రూ.37,500 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇక సెలెరియో మోడల్ ఎక్కువ మైలేజ్, సులభమైన డ్రైవింగ్ అనుభవంతో బాగా పాపులర్ అయింది. దీనిపై కూడా అంతే మొత్తంలో ఆఫర్లు ఉన్నాయి. రోజువారి వినియోగానికి ఇది చాలా అనువుగా ఉంటుంది.
స్పోర్టీ హ్యాచ్‌బ్యాక్ ఇష్టపడేవారికి ఈ నెలలో మారుతి స్విఫ్ట్ బెస్ట్ ఛాయిస్. స్విఫ్ట్ ఆటోమేటిక్ వేరియంట్లపై రూ.45,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. మాన్యువల్ వేరియంట్లపై రూ.40,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్‌యూవీ ప్రియుల కోసం మారుతి బ్రెజా మోడల్‌పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. పెట్రోల్, సీఎన్‌జీ రెండు వేరియంట్లపై రూ.45,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు.
55
Maruti Victories
అయితే మారుతి విక్టోరిస్ (Victories) మోడల్‌పై నేరుగా క్యాష్ డిస్కౌంట్ ఏమీ లేదు. కానీ ఎక్స్ఛేంజ్ బోనస్ ద్వారా కస్టమర్లకు ప్రయోజనం కల్పిస్తున్నారు. పెట్రోల్, సీఎన్‌జీ మోడళ్లపై రూ.20,000 వరకు, హైబ్రిడ్ వేరియంట్లపై రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ ఏప్రిల్ నెల మారుతి ఆఫర్లు కొత్త కారు కొనాలనుకునే వారికి ఒక మంచి అవకాశమనే చెప్పాలి.