మహీంద్రా కార్ల ధరల పెంపు: ఏ మోడల్ పై ఎంత పెరిగిందో తెలుసుకోండి..

First Published Sep 21, 2021, 7:08 PM IST

 దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా మంగళవారం  కంపెనీ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను రూ .12,000 నుండి రూ .30,000 మధ్య పెంచింది. ఇటీవల లాంచ్ చేసిన బొలెరో నియో ఎస్‌యూవీ ధరపై కంపెనీ అతిపెద్ద పెంపు చేసింది.

మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూ‌వి ధరలను రూ .30,000 వరకు పెంచింది. మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూ‌విని జూలై నెలలో రూ .8.48 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర వద్ద ప్రవేశపెట్టారు . మల్టీ-టెర్రైన్ ఫీచర్ కలిగిన ఈ ఎస్‌యూ‌వి టాప్-స్పెక్ ట్రిమ్ బొలెరో నియో ఎన్10 (O) ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.69 లక్షలు. 

తాజా పెంపుతో మహీంద్రా బొలెరో నియో ఎన్10 (O) ఎక్స్-షోరూమ్ ధర రూ .10.99 లక్షలకు పెరిగింది. ఎన్4 వేరియంట్  ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ .8.77 లక్షలకు పెరిగింది.
 
బొలెరో నియో ఎస్‌యూ‌వితో పాటు మహీంద్రా స్కార్పియో ఎస్‌యూ‌వి ధరలను కూడా పెంచింది. స్కార్పియో ఎస్11 వేరియంట్ కొనుగోలు చేయడానికి ఇప్పుడు  మీరు రూ. 22,000 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. త్వరలో స్కార్పియో  ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. 

ఇంకా  మహీంద్రా మరాజ్జో ఎం‌పి‌వి ధరను కూడా పెంచింది. మరాజో ఎం‌పి‌వి ధర రూ .12,000 నుండి రూ .14,000 మధ్య పెరిగింది. మహీంద్రా కొత్త బొలెరో నియో ఎస్‌యూ‌విని జూలై 2021లో విడుదల చేసింది. అలాగే కంపెనీ బొలెరో నియో - ఎన్4, ఎన్8, ఎన్10  మూడు వేరియంట్‌లను కూడాప్రారంభించింది. ఆ తర్వాత ఆగస్టులో కంపెనీ బొలెరో నియో కొత్త ఎన్10 ఆప్షనల్ (O) వేరియంట్‌ను విడుదల చేసింది. మల్టీ-టెర్రైన్ టెక్నాలజీ (మాన్యువల్ లాక్ డిఫరెన్షియల్) వంటి టెక్నాలజీని ఈ వేరియంట్‌లో ఇచ్చారు. అంతేకాకుండా అన్ని ఫీచర్లు ఇతర వేరియంట్‌ల లాగానే ఉంటాయి. కొత్త బొలెరో నియో 7 సీట్లలో అందుబాటులో ఉంది (5+2).

బొలెరో నియో ఎన్10 (O) కొత్త టాప్ ఎండ్ వేరియంట్ ముఖ్యంగా మెకానికల్ లాకింగ్ రియర్ డిఫరెన్షియల్ ఫీచర్‌తో వస్తుంది. దీని ద్వారా డ్రైవర్ డిఫరెన్షియల్ ను మ్యాన్యువల్ గా లాక్ చేయవచ్చు. వాహనం ఇరుక్కుపోయిన సందర్భంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇతర ముఖ్యమైన ఫీచర్స్ లో స్టాటిక్ బెండింగ్ హెడ్‌ల్యాంప్‌తో ఫాలో మీ హోమ్ ఫంక్షన్, ఎల్‌ఈ‌డి డి‌ఆర్‌ఎల్ లు, అల్లాయ్ వీల్స్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్, డ్రైవర్ అండ్ కో-డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్‌లు, మిడిల్-రో సెంటర్ ఆర్మ్‌రెస్ట్, ఎలక్ట్రిక్-అడ్జస్ట్ వింగ్ మిర్రర్స్,  క్రూయిజ్ కంట్రోల్ అండ్ ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ఉన్నాయి. 

ఇంజన్, పవర్ అండ్ మైలేజ్

బోలెరో నియో 1.5 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్, 160 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ వస్తుంది. మహీంద్రా ఈ ఎస్‌యూ‌విలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఇవ్వలేదు. దీనితో పాటు ఈ ఇంజిన్‌లో మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ఎస్‌యూ‌విని ఎలక్ట్రానిక్‌గా స్టార్ట్ చేయవచ్చు/ ఆఫ్ చెయవచ్చు. ఈ కాంపాక్ట్ ఎస్‌యూ‌వి 17.28 kmpl మైలేజ్ ఇస్తుందని పేర్కొంది, అంటే దాని BS-IV వెర్షన్ కంటే కొంచెం తక్కువ.

click me!