ఈ ఆఫర్లు ప్రస్తుతం యమహా ఫ్యాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్, యమహా రే జెడ్‌ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ , యమహా రే జెడ్‌ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్‌ఐ, యమహా ఫ్యాసినో 125 ఎఫ్‌ఐ నాన్ హైబ్రిడ్ వెర్షన్ పై ప్రకటించారు. ఈ ప్రత్యేకమైన ఆఫర్లు, ఫైనాన్స్ స్కీమ్‌లు భారతదేశమంతటా అందుబాటులో ఉంటాయి అలాగే 30 సెప్టెంబర్ 2021 వరకు చెల్లుబాటు అవుతుంది. యమహా ఇండియా తాజాగా ఫాసినో 125 ఎఫ్‌ఐ, రేజెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ వెర్షన్‌లను విడుదల చేసింది. ఈ ఆఫర్లు వివిధ రాష్ట్రాలలో భిన్నంగా ఉంటాయి.
యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ (నాన్-హైబ్రిడ్), యమహా రేజెడ్ఆర్ ఎఫ్‌ఐ (నాన్-హైబ్రిడ్) వెర్షన్‌ల కొరకు కంపెనీ రూ.3,876 ఇన్షూరెన్స్ బెనెఫిట్స్ లేదా రూ.999 డౌన్‌పేమెంట్, స్క్రాచ్ అండ్ విన్ ఆఫర్ మినిమమ్ అశుర్డ్ గిఫ్ట్ రూ.2,999 అలాగే 1 లక్ష వరకు బంపర్ గిఫ్ట్ ప్రకటించింది. తమిళనాడు కోసం యమహా రూ.3,876 ఇన్షూరెన్స్ బెనెఫిట్స్ అందిస్తోంది లేదా రూ. 999 కంటే డౌన్ పేమెంట్, రూ .2,999 అశుర్డ్ గిఫ్ట్ ఇస్తుంది.
జూలై 2021లో ప్రారంభించిన యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ పై రూ.5వేల క్యాష్ బ్యాక్ లేదా రూ.999 డౌన్‌పేమెంట్ లేదా రూ.6,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ రూ.2,999 అశుర్డ్ గిఫ్ట్, రూ.1 లక్ష వరకు స్క్రాచ్ అండ్ విన్ బంపర్ ఆఫర్ ఇస్తుంది. తమిళనాడు కోసం యమహా రూ.5,000 క్యాష్ బ్యాక్ లేదా రూ.999 డౌన్ పేమెంట్ లేదా రూ.6,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, రూ.2,999 అశుర్డ్ గిఫ్ట్ అందిస్తోంది.