బి‌ఎం‌డబల్యూ కొత్త డార్క్ షాడో ఎడిషన్.. ప్రపంచవ్యాప్తంగా 500 కార్లు మాత్రమే ఉత్పత్తి..

First Published | Jun 7, 2021, 2:41 PM IST

ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్ బి‌ఎం‌డబల్యూ తాజాగా ఇండియాలో ఒక కొత్త లగ్జరీ కారును విడుదల చేసింది. బి‌ఎం‌డబల్యూ ఎక్స్7 ఎం50డి  'డార్క్ షాడో' ఎడిషన్  పేరుతో వస్తున్న ఈ కారు ధర రూ.2.02 కోట్ల (ఎక్స్-షోరూమ్)తో  ప్రారంభమవుతుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మొట్టమొదటి స్పెషల్ ఎడిషన్ మోడల్. 

బి‌ఎం‌డబల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా కేవలం 500 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేసింది. అమెరికాలోని దక్షిణ కరోలినాలోని బవేరియన్ కార్ల తయారీ సంస్థ స్పార్టన్బర్గ్ ప్లాంట్లో ఈ కారుని తయారు చేశారు. కొత్త డార్క్ షాడో ఎడిషన్‌ను బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7లో అందించే ఇంజిన్‌ ఆప్షన్స్ తో వస్తుందని బిఎమ్‌డబ్ల్యూ తెలిపింది. అయితే భారతదేశంలో బిఎమ్‌డబ్ల్యూ దీనిని ఎం50డి ట్రిమ్‌లో మాత్రమే అందిస్తోంది.
బి‌ఎం‌డబల్యూ ఎక్స్7 ఎం50డి డార్క్ షాడో ఎడిషన్‌లో మాత్రమే ప్రత్యేకంగా లభిస్తుంది. అయితే ఎం అనేది ఈ ఎస్‌యూ‌వి వెర్షన్ ని సూచిస్తుంది. సంస్థ ప్రత్యేకమైన కస్టమైజేషన్ విభాగం బి‌ఎం‌డబల్యూ ఇండివిజువల్ దీనిని రూపొందించారు. కొత్త ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్‌లో అతిపెద్ద హైలైట్ ఏంటంటే స్పెషల్ పెయింట్ ఫినిషింఫ్, దీనిని ఆర్కిటిక్ గ్రే మెటాలిక్ అని పిలుస్తారు. బూడిద రంగు షెడ్ లో బి‌ఎం‌డబల్యూ పెయింట్ ఫినిషింగ్ ఉపయోగించడం మొదటిసారి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 7 ఎడిషన్ డార్క్ షాడో జెట్-బ్లాక్ మాట్టే ఫినిషింగ్ తో వి-స్పోక్ డిజైన్‌లో 22 అంగుళాల ఎం లైట్-అల్లాయ్ వీల్స్, ఎమ్ స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో వస్తుంది. లిమిటెడ్-ఎడిషన్ మోడల్ లోపలి భాగంలో ఆరు లేదా ఏడు-సీట్ల కాన్ఫిగరేషన్లలో ఎలక్ట్రిక్ అడ్జస్ట్ చేయగల కంఫర్ట్ సీట్స్, డ్రైవర్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ కోసం మెమరీ ఫంక్షన్‌ ఇచ్చారు.
సెంటర్ కన్సోల్ పియానో ​​బ్లాక్ షేడ్‌లో ఉంటుంది. సిగ్నేచర్ క్రిస్టల్ గేర్ లివర్‌ను కూడా ఉంది. మిగిలిన క్యాబిన్ ఫీచర్లు చూస్తే ఈ ఎస్‌యూవీ మొత్తం ఎం స్పోర్ట్ వేరియంట్‌తో సమానంగా ఉంటాయి. 8-స్పీడ్ స్టెప్-ట్రోనిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ గేర్ కు 3.0-లీటర్, ఆరు సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌ లభిస్తుంది. ఈ వేరియంట్ ఇంజన్ 400 బిహెచ్‌పి, 760 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ కోసం ట్యూన్ చేయబడింది. అలాగే కేవలం 5.4 సెకన్లలో 100 కి.మీ స్పీడ్ అందుకుంటుంది.
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 7ని మరో రెండు వేరియంట్లలో కూడా అందిస్తున్నారు. వీటిలో ఒకటి ఎక్స్7 30డి దీనికి 3.0-లీటర్, ఇన్-లైన్ సిక్స్-సిలిండర్, ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్‌ లభిస్తుంది. అలాగే 260 బి‌హెచ్‌పి, 620 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరొకటి ఎక్స్7 40ఐ దీనిలో 3.0-లీటర్, ఇన్-లైన్ సిక్స్-సిలిండర్, ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ ఇచ్చారు. ఇది 335 బిహెచ్‌పి, 450 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఇస్తుంది. ఈ రెండు ఇంజన్ లకు 8 -స్పీడ్ స్టెప్ట్రానిక్ గేర్‌బాక్స్‌ స్టాండర్డ్ గా వస్తుంది.

Latest Videos

click me!