పండగకి మరింత స్పెషల్ గా... ఈ సెలబ్రిటీలు ఒక్కొక్కరు కార్ల కోసం కోట్లు ఖర్చు పెట్టారు!

First Published | Oct 26, 2023, 5:46 PM IST

ఈ దసరా పండగకి బాలీవుడ్ బ్యూటీలు శ్రద్ధా కపూర్, పూజా హెగ్డేలు చాల ఘనంగా జరుపుకున్నారు. ఈ ఇద్దరూ సెలెబ్రిటీల  ఇంటి  గ్యారేజీలోకి ఖరీదైన కొత్త కార్ వచ్చి చేరింది. శ్రద్ధా కపూర్ రెడ్ కలర్ లంబోర్గినీ హురాకాన్ టెక్నికాను కొనుగోలు చేయగా, పూజా హెగ్డే కొత్త రేంజ్ రోవర్ SVని కొనుగోలు చేసింది.
 

 పండగలు ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపుతుంది. కొంతమంది ఈ రోజున కార్-బైక్ వంటి కొత్త వాహనాలను కొని ఈ పండుగను జరుపుకుంటారు. సామాన్యులతో పాటు బాలీవుడ్ తారలు కూడా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ దసరాకి  బాలీవుడ్ బ్యూటీలు శ్రద్ధా కపూర్, పూజా హెగ్డేలు కూడా ఘనంగా జరుపుకున్నారు. నివేదికల ప్రకారం, శ్రద్ధా కపూర్ రెడ్ కలర్  లంబోర్గినీ హురాకాన్ టెక్నికాను రూ. 4.8 కోట్లకి కొనగా, పూజా హెగ్డే రూ. 4 కోట్ల విలువైన కొత్త రేంజ్ రోవర్ ఎస్వీని కొనుగోలు చేసింది.

ఈ ఇద్దరు హీరోయిన్లు కొత్త కారుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో  ఇద్దరు నటీమణులను  కొత్త కారుతో చూడవచ్చు. శ్రద్ధా కపూర్ కొత్త రెడ్  కలర్ లంబోర్గినీ హరికేన్ టెక్నికాతో సెల్ఫీ కూడా తీసుకుంది. శ్రద్ధా కపూర్‌తో ఉన్న ఈ ఫోటోను ఆమె స్నేహితురాలు పూజా చౌదరి పోస్ట్ చేసింది. భారతదేశంలో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4.04 కోట్లు. లంబోర్ఘిని హురాకాన్ ఆగస్టు 2022లో భారతదేశంలో లాంచ్ అయింది. ఈ కారు  5.2-లీటర్, NA V10 ఇంజన్,  640 HP శక్తిని, 565 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. శ్రద్ధా కపూర్ గ్యారేజీలో ఆడి క్యూ7, మెర్సిడెస్ బెంజ్ ఎంఎల్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ ఇంకా  టయోటా ఫార్చూనర్ వంటి ఇతర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. 
 


రూ.4 కోట్ల విలువైన కొత్త రేంజ్ రోవర్ SV ముందు బాలీవుడ్ నటి పూజా హెగ్డే తన కుటుంబంతో కలిసి పోజులిచ్చిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. నీలిరంగు డ్రెస్ ధరించి పూజ హెగ్డే తన కొత్త కారులోంచి దిగడం కూడా చూడవచ్చు. బ్రిటిష్ SUV మేకర్ ల్యాండ్ రోవర్   ఆఫ్-రోడర్ డిఫెండర్ ఆల్ టైమ్ బెస్ట్  SUVలలో ఒకటి. ఈ SUV వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు మొదలైనవారితో బాగా పాపులారిటీ పొందింది. తాజాగా  ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ కూడా ఈ లగ్జరీ ఎస్‌యూవీని సొంతం  చేసుకుంది.

Latest Videos

click me!