ఇండియాలో అత్యధికంగా దొంగిలించబడిన టాప్ కార్లు ఇవే : ఎందుకో తెలుసా... కారణం ఇదే..

First Published | Oct 26, 2023, 12:45 PM IST

భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలకు ఏదో ఒక విధంగా కారు కొనడం అనేది ఒక కల. కారు కొనడం చాలా ఖరీదైన విషయం  అయితే దానిని దొంగిలించడం కూడా ఈజీ అయిపొయింది. కెమెరాలు ఉన్న, దొంగతనాన్ని నిరోధించే పరికరాలు ఉన్న, సెన్సార్లు ఉన్న సరే కార్లను దొంగలు డబ్బు కోసం దొంగిలిస్తుంటారు.
 

ఒక కొత్త  నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా 56 శాతం కంటే ఎక్కువ వాహనాల దొంగతనాలు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో చోటుచేసుకుంటున్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 లక్షకు పైగా వాహనాలు దొంగిలించబడుతున్నాయి. ఈ విధంగా, దేశంలో అత్యధికంగా దొంగిలించబడిన ఐదు కార్ల గురించి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే, అ కార్లు వాటి  ఫీచర్స్  కారణంగా  దొంగిలించబడుతున్నాయి.
 

మారుతీ సుజుకి స్విఫ్ట్: భారతదేశంలో అత్యధికంగా దొంగిలించబడిన కారు

మారుతి సుజుకి స్విఫ్ట్ భారతదేశంలో అత్యధికంగా దొంగిలించబడిన కారు. 2005లో ప్రారంభించినప్పటి నుండి మారుతి సుజుకి స్విఫ్ట్ దేశవ్యాప్తంగా కార్ల దొంగల మధ్య ఒక పాపులర్  అప్షన్ గా కొనసాగుతోంది. దీని లుక్, మైలేజ్, ​​ కెపాసిటీ,  రీసేల్  వాల్యూ ఈ కారును దొంగలకు ఇష్టమైనదిగా చేస్తున్నాయి. ఈ కారు 1.2-లీటర్, 4-సిలిండర్ NA పెట్రోల్ ఇంజన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ అండ్ AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.04 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.


మారుతి సుజుకి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ దేశంలో అత్యధికంగా దొంగిలించబడిన కారులలో రెండవది. ఈ మోడల్ భారతదేశంలోని ఫ్యామిలీస్ కి  టాప్   అప్షన్.  ఈ కారు 1.0-లీటర్, 3-సిలిండర్ NA పెట్రోల్ ఇంజన్ అలాగే  1.2-లీటర్, 4-సిలిండర్ NA పెట్రోల్ ఇంజన్ అనే రెండు ఇంజన్ అప్షన్ లో  లభిస్తుంది. స్విఫ్ట్  లాగానే దీనికి  5-స్పీడ్ మాన్యువల్ అండ్  AMT ఆటోమేటిక్ గేర్  ట్రాన్స్‌మిషన్‌  అందిస్తుంది. వ్యాగన్ఆర్ ధర రూ. 5.54 లక్షల నుంచి ప్రారంభమై రూ. 7.42 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో హ్యుందాయ్ క్రెటా ఒకటి, హ్యుందాయ్ క్రెటా దేశంలో అత్యధికంగా దొంగిలించబడిన మూడవ వాహనం. క్రెటాను తిరిగి అమ్మడానికి దొంగలు ఆసక్తి చూపడం లేదు. కానీ, దాని విడి భాగాలు విలువైనవి. వీటికి నిరంతర డిమాండ్  ఉంటుంది. ఈ కార్ రెండు ఇంజన్ అప్షన్స్ లో వస్తుంది - 1.5-లీటర్, 4-సిలిండర్ NA పెట్రోల్ ఇంజన్ ఇంకా 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్. రెండూ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా ధరలు రూ. 10.87 లక్షల నుంచి ప్రారంభమై రూ. 19.2 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
 

హ్యుందాయ్ సాంట్రో

అత్యధికంగా దొంగిలించబడిన కార్ల లిస్ట్ లో ఉన్న మరో హ్యుందాయ్ మోడల్ హ్యుందాయ్ సాంట్రో. ఈ కారు 4వ స్థానంలో ఉంది. చిన్న కార్లలో తక్కువ ధరకు ఇంకా  ప్రీమియం ఫీచర్లకు పేరుగాంచిన సాంట్రో తక్కువ అమ్మకాల కారణంగా నిలిపివేయబడింది. సాంట్రో కారును రీసేల్ చేయడమే కాకుండా, వాహనాన్ని కంపెనీ నిలిపివేసిన కారణంగా విపరీతమైన డిమాండ్ ఉన్న దాని విలువైన విడిభాగాల కోసం కూడా దొంగలు టార్గెట్ చేస్తున్నారు.
 

హోండా సిటీ

దేశంలో అత్యధికంగా దొంగిలించబడిన కార్లలో హోండా సిటీ ఐదవ స్థానంలో ఉంది. 1990లలో భారతదేశంలో ప్రవేశపెట్టబడిన హోండా సిటీ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న హోండా మోడల్. 1.5 లీటర్ NA పెట్రోల్ ఇంజన్ ఇంకా  1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ అనే రెండు ఇంజన్ ఆప్షన్‌లను అందిస్తుంది. ఈ సెడాన్ కారు ధర రూ. 11.67 లక్షలతో మొదలై రూ. 16.15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
 

Latest Videos

click me!