పెట్రోలు చుక్క కూడా వృధాగా పోదు! 150-160cc బైక్‌లో బెస్ట్ మైలేజ్ బైక్ ఎదో తెలుసా?

First Published | Jun 18, 2024, 6:33 PM IST

గత కొన్ని సంవత్సరాలలో 150-160cc స్పోర్టీ బైక్స్  కూడా ఇంధన ఆదా టెక్నాలజీతో మైలేజీని గణనీయంగా పెంచుతున్నాయి. ఆ కోవలో అమ్మకానికి అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ బైక్స్ ఏంటో చూద్దాం....
 

హోండా ప్రస్తుతం 150-160cc విభాగంలో యునికార్న్, SP160 అనే రెండు బైకులను విక్రయిస్తోంది. ఈ రెండు మోడల్‌లు ఒకే 162.7cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ మోటార్‌తో శక్తిని పొందుతాయి. యునికార్న్‌లో ఈ ఇంజన్ 60 kmpl మైలేజీని ఇస్తుంది, SP160లో  65 kmpl మైలేజీని అందిస్తుంది.
 

TVS Apache RTR 160 159.7cc ఎయిర్-కూల్డ్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. ఈ బైక్ లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని టీవీఎస్ పేర్కొంది. దీని ధర రూ. 1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్).
 


అత్యంత మంచి ఆదరణ పొందిన కొత్త జనరేషన్ పల్సర్ మోడల్‌లలో ఒకటి, N160 బలమైన పనితీరును అందిస్తుంది. అయితే ఈ బైక్  51.6 kmpl మైలేజీని అందిస్తుంది (ARAI-అంచనా). దీని ధర రూ. 1.33 లక్షలు (ఎక్స్-షోరూమ్).
 

Hero Xtreme 160R 49 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ 160సీసీ, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ బైక్ ధర రూ. 1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్).
 

పల్సర్ ఎన్150 పవర్ ఫుల్ పల్సర్ ఎన్160 కంటే తక్కువ మైలేజీని అందిస్తుంది. 150cc పల్సర్ 47 kmpl మైలేజీని ఇస్తుందని పేర్కొన్నారు. దీని (ఎక్స్-షోరూమ్) ధర రూ.1.18 లక్షల నుండి రూ.1.33 లక్షలుగా నిర్ణయించారు.
 

Latest Videos

click me!