ఎక్కువగా బైక్ నడిపితే డ్యామేజ్ అయ్యేది అదే.. డాక్టర్స్ ఎం చెబుతున్నారంటే..?

First Published Jun 11, 2024, 11:15 PM IST

ఎక్కువ దూరం బైక్‌పై వెళ్లడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరిగి సమస్యలు వస్తాయి. దీని వల్ల ఎముకల బలహీనత, ఆర్థరైటిస్ ఇంకా ఆరోగ్య   ప్రమాదాలని కూడా పెంచుతుంది. మీరు ఈ ప్రమాదాలను నివారించాలనుకుంటే వైద్యుల సలహా తీసుకోవడం పాటించండి. 
 

బైక్‌పై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడం ప్రస్తుత ట్రెండ్. చాలా మంది అబ్బాయిలకు ఈ క్రేజ్ ఉంటుంది. వీకెండ్ టైంలో బైక్ తీసుకుని దూరపు ప్రదేశాలకి  వెళ్తుంటారు. అయితే ఎక్కువ దూరం బైక్‌పై వెళ్లడం అంత తేలికైన పని కాదు. ఇది చాలా అలసట, దృఢత్వం కోల్పోవడం కలిగిస్తుంది. అయితే ఎక్కువ గంటలు బైక్ నడపడం వల్ల ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉందని మీకు తెలుసా. అవును, ఇది ఆర్థరైటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
 

లాంగ్ డ్రైవ్ కారణంగా తొడ, కాలు ఇంకా  వెన్ను  కండరాలు బలహీనపడతాయి. ఇలా జరగకుండా  ఉండాలంటే  మీరు కొన్ని నిపుణుల సలహాలను అనుసరించాలి. దీనివల్ల మీ ఆరోగ్యం దృడంగా బాగుంటుంది. 
 

 knee and spine rheumatologists నిపుణుల సలహాల ప్రకారం , ఈ కండరాలపై ఒత్తిడి మోకాలి, వెన్నునొప్పి ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే బైక్ నడుపుతున్నప్పుడు పదే పదే బ్రేకులు వేయడం, ఒక్కోసారి సడన్ గా కాలు నేలపై పెట్టడం వంటివి చేయాల్సి వస్తుంది. దీని కారణంగా కాలులో ఒత్తిడి తరచుగా కనిపిస్తుంది.
 

బైక్ నడుపుతున్నప్పుడు మంచి ప్యాడింగ్ ధరించండి. మోకాలు, మోచేయి, వెన్నుముకకి సపోర్ట్ గార్డ్స్ ధరించాలి. దీని ద్వారా   ఆర్థరైటిస్, గాయాలను నివారిస్తుంది.
 

దూర ప్రయాణాలలో విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ కండరాలను సడలిస్తుంది, అలసటను తగ్గిస్తుంది. పదే  పదే తరచుగా లాంగ్ డ్రైవ్‌లను నివారించండి.
 

Biker, Stock Photo

బైక్‌ను సురక్షితంగా నడపడానికి మీరు కొన్ని విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. అంటే నిత్యం హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇలా చేయడం కూడా  ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
 

మద్యం సేవించి బైక్ నడపవద్దు. ఇలా చేయడం మీ జీవితాలను అలాగే  ఇతరులను ప్రమాదంలో పడేస్తుంది. మీరు పూర్తిగా స్పృహతో  ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే రైడ్ చేయండి.
 

Latest Videos

click me!