Kia EV6 vs BMW i4: ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లలో ఏది కొనడం బెస్ట్ తెలుసుకోండి..

First Published Jun 4, 2022, 11:28 AM IST

దక్షిణ కొరియాకు చెందిన కియా  మొదటి ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ కారు EV6ను జూన్ 2న ఇండియాలో లాంచ్ చేసింది. లాంచ్ చేసిన కొంత సమయనికే కంపెనీ "సోల్డ్ అవుట్" గుర్తును పెట్టింది. కంపెనీ మొదట ఇండియాలో 100 కార్లను మాత్రమే విక్రయిస్తుంది ఇంకా ఈ 100 యూనిట్లను ఇప్పటికే కొనుగోలుదారులు బుక్ చేసుకున్నారు. EV6 భారత మార్కెట్లోకి రావడానికి ఒక వారం ముందు లగ్జరీ కార్ బ్రాండ్ BMW  ఎలక్ట్రిక్ కార్ i4 ఎలక్ట్రిక్ సెడాన్‌ను లాంచ్ చేసింది. EV6 అండ్ i4 రెండూ చాలా దగ్గరగా ఉంటాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ల స్పెసిఫికేషన్ల మధ్య  తేడాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
 

మోటార్ పవర్ 
Kia EV6 రెండు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది - RWD అండ్ AWD.  బ్యాక్ వీల్-డ్రైవ్ లేఅవుట్‌లో Kia EV6 గరిష్టంగా 229 hp పవర్ అవుట్‌పుట్ అండ్ గరిష్టంగా 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ మోడల్‌లు 325 hp పవర్ అవుట్‌పుట్ అండ్ 605 Nm గరిష్ట టార్క్‌ను క్లెయిమ్ చేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 3.5 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. 

BMW i4 eDrive 40 వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 335 హెచ్‌పి పవర్ అండ్ 430 ఎన్ఎమ్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. BMW i4 ఎలక్ట్రిక్ సెడాన్ కేవలం 5.7 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకుంటుంది. 
 

బ్యాటరీ, ఛార్జింగ్ టైమ్  అండ్ మైలేజ్ 
EV6 ఎలక్ట్రిక్ కారు 77.4 kWh బ్యాటరీ ప్యాక్ అండ్ రెండు ఛార్జింగ్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది - 50 kW ఛార్జర్ అండ్ 350 kW ఛార్జర్. 50 kW ఛార్జర్ 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 73 నిమిషాలు పడుతుంది. అయితే  350 kW ఛార్జర్ తో 18 నిమిషాలు మాత్రమే పడుతుంది. Kia EV6  ఫుల్ చార్జ్ తో 585 కి.మీ క్లెయిమ్ చేయబడింది. 

అయితే బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఒక్కసారి ఛార్జింగ్‌తో 590 కి.మీ ప్రయాణిస్తుంది. దీనిని 205 kW ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు, ఇంకా కేవలం 10 నిమిషాల్లో 160 కి.మీల పరిధిని అందిస్తుంది. 11 kW AC ఛార్జర్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి 8.25 గంటలు పడుతుంది, అయితే 50 kW DC ఛార్జర్ 100 కి.మీల పరిధిని అందించడానికి ఛార్జ్ చేయడానికి 18 నిమిషాలు పడుతుంది. 
 

సైజ్ ప్రకారం
Kia EV6 క్యాబిన్‌ను విలాసవంతమైన ఇంకా భవిష్యత్తుకు అనుగుణంగా మార్చడంపై దృష్టి పెట్టబడింది. క్యాబిన్ చాలా ప్రయాణీకులందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. కారు సైజ్ విషయానికి వస్తే, Kia EV6 మొత్తం పొడవు 4695 mm, వెడల్పు 1,890 mm అండ్ 1,545 mm ఎత్తుతో చాలా పెద్ద కారు. ఈ కారు 2,900కి ఎం‌ఎం వీల్‌బేస్‌  ఉంది. అలాగే, కియా ఈవీ6 కారులో స్టోరేజ్ స్పేస్ కూడా బాగుంది. కారు ట్రంక్ వాల్యూమ్ 480 లీటర్లు, ఫ్రాంక్ వాల్యూమ్ 20 లీటర్లు. 

BMW i4 సైజ్ గురించి మాట్లాడితే, ఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారు పొడవు 4,783 mm, వెడల్పు 1,852 mm, ఎత్తు 1,448 mm. దీని వీల్‌బేస్ 2,856 ఎం‌ఎం,  470 లీటర్ల స్టోరేజ్ స్పేస్‌ను పొందుతుంది. BMW i4 మోటారు వెనుక వైపూ అమర్చబడినప్పటికీ, ఫ్రాంక్ స్పేస్ కోల్పోతుంది. 

Kia EV6 భారతీయ మార్కెట్లో  RWD వేరియంట్  ఎక్స్-షోరూమ్ ధర రూ. 59.95 లక్షలు. AWD వేరియంట్  ఎక్స్-షోరూమ్ ధర రూ. 64.95 లక్షలు. BMW i4 గురించి చెప్పాలంటే భారతదేశంలో ఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 69.90 లక్షలు.

click me!