ఈ కొత్త ఫీచర్లను క్యాబిన్ లో చూడవచ్చు
కొత్త బ్రెజ్జాలో ఎన్నో కొత్త డిజైన్ అప్‌డేట్‌లు ఆశించవచ్చు. కొత్త ఫీచర్‌లతో పాటు క్యాబిన్ లోపల డ్యాష్‌బోర్డ్, మొత్తం లేఅవుట్ మారవచ్చు. ఇంకా కొత్త XL6 అండ్ ఎర్టిగా నుండి తీసుకోబడిన 9.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రావచ్చు. కొత్త మోడల్ ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, HUD డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉంటాయి. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సుజుకి కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో వస్తుందని భావిస్తున్నారు.