Jeep Grand Cherokee : ఈ కారుపై ఇస్తున్న డిస్కౌంట్ మరో కారే కొనొచ్చు... ధర ఎంత తగ్గిందో తెలుసా?

Published : Dec 11, 2025, 03:04 PM IST

జీప్ ఇండియా తన గ్రాండ్ చెరోకీ ప్రీమియం ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. జనవరిలో ధరలు పెరిగే అవకాశాలుండటంతో ఇప్పుడే ఈ లగ్జరీ ఎస్‌యూవీని కొనడం మంచి అవకాశంగా ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

PREV
14
జీప్ ఇండియా ఇయర్ ఎండ్ ఆఫర్

2025 ముగుస్తున్నందున కార్ల కంపెనీలు డిసెంబర్ లో భారీగా ఇయర్-ఎండ్ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలో జీప్ ఇండియా తన ప్రీమియం ఎస్‌యూవీ గ్రాండ్ చెరోకీపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ లగ్జరీ ఎస్‌యూవీపై డిసెంబర్ నెల మొత్తం రూ.4 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఇయర్-ఎండ్ లో కారు కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.

24
రూ.4 లక్షల తగ్గింపా..!

గతంలో రూ.63 లక్షల ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ.59 లక్షలకు తగ్గింది. ప్రీమియం లుక్, శక్తివంతమైన ఇంజిన్, ఆఫ్-రోడ్ సామర్థ్యం ఉన్న ఎస్‌యూవీ కొనాలనుకునేవారికి ఇది గోల్డెన్ టైమ్. జనవరి 2026 లో ధరలు పెరుగుతాయని డీలర్లు అంచనా వేస్తున్నందున, డిసెంబర్ సరైన సమయం అని నిపుణులు అంటున్నారు. కొత్త మోడల్‌లో షార్ప్ డిజైన్, ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, 360° కెమెరా వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

34
జీప్ చెరోకీ ఫీచర్లు

కారు బయటి డిజైన్ జీప్ సిగ్నేచర్ స్టైల్‌ను ఆధునికంగా చూపిస్తుంది. 7-స్లాట్ గ్రిల్, షార్ప్ ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, బలమైన బంపర్ దీని ప్రత్యేకతలు. లోపల లెదర్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, 9-స్పీకర్ సౌండ్ సిస్టమ్, 1,076 లీటర్ల బూట్ స్పేస్ ఉన్నాయి. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 270 హెచ్‌పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

44
జీప్ చేరోకి ప్రత్యేకతలు

జీప్ చెరోకీ సామర్థ్యం ప్రత్యేకంగా ఉంటుంది. 215 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 10.25 అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు సుదీర్ఘ ప్రయాణాల్లో సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే ఈ ఇయర్ ఎండ్ డిస్కౌంట్ వివరాలు నగరం, డీలర్, వేరియంట్, స్టాక్‌ను బట్టి మారవచ్చు. సరైన సమాచారం కోసం దగ్గరలోని జీప్ డీలర్‌ను సంప్రదించడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories