మీన్ మెటల్ మోటార్స్ (ఎంఎంఎం) అనే భారతీయ స్టార్టప్ భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ సూపర్ కారు "అజాని"ని నిర్మించడానికి ఒక ప్రాజెక్ట్ను ప్రారంభించినట్లు ప్రకటించింది.
టాప్ స్పీడ్ అండ్ మైలేజ్
అజానీ కార్ టాప్ స్పీడ్ గంటకు 350 కి.మీ అని కంపెనీ పేర్కొంది. ఈ సూపర్ కార్ రెండు సెకన్లలోపు 0 నుండి 100 కి.మీ స్పీడ్ అందుకోగలదు. ఈ సూపర్ కారులో ఉపయోగించే ఎలక్ట్రిక్ మోటార్ 1,000 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఫుల్ ఛార్జ్‌తో 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని సంస్థ పేర్కొంది
ఎంఎంఎం సంస్థని 2012 సంవత్సరంలో సార్థక్ పాల్ స్థాపించారు అయితే 201లో బ్రాండ్ విలీనం అయ్యింది. భవిష్యత్తులో అత్యాధునిక, టెక్నాలజి ఆవిష్కరణలతో కూడిన భారతదేశపు మొట్ట మొదటి ఎలక్ట్రిక్ సూపర్ కారును నిర్మించడమే సంస్థ లక్ష్యం..
లుక్ అండ్ డిజైన్
అజానీ సూపర్‌కార్ మెక్‌లారెన్ సూపర్‌కార్ల నుండి ప్రేరణ పొందింది. కారు ముందు భాగంలో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, పూర్తిగా కప్పబడిన ప్యానెల్స్, పెద్ద సైడ్ ఎయిర్ వెంట్స్‌తో అగ్రెసివ్ గా కనిపిస్తుంది. కారుకి ఒక అందమైన కర్వ్ బోనెట్, మెరిసే వీల్స్, ఆల్-బ్లాక్ కాక్‌పిట్, కర్వ్ అండ్ ఏరోడైనమిక్ టెయిల్ సెక్షన్ ఈ సూపర్‌కార్‌ను చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది.
ధర ఎంత
స్టార్టప్ సంస్థ 2022 ద్వితీయార్ధంలో ఈ కారు మొదటి నమూనాను తీసుకువస్తుందని సంస్థ పేర్కొంది. ఈ సూపర్ కారు ధర గురించి మాట్లాడితే ఎంఎంఎం అజాని ధర 1,20,000 యూఎస్‌డి నుండి మొదలవుతుంది, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 89 లక్షలు. ఇప్పుడు అసలు ధర గురించి మాట్లాడితే భారతీయ మార్కెట్లో ఈ కార్ లాంచ్ అయిన తర్వాత ఎంఎంఎం అజాని ధర సుమారు రూ .1.5 కోట్లు ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ సూపర్ కారుని మైక్రో ప్లాంట్‌లో నిర్మించనున్నట్లు సంస్థ పేర్కొంది. ఆటోమొబైల్ తయారీ ప్లాంట్ ధరలో ఐదవ వంతు కంటే తక్కువ ఉంటుంది. ఇతర కార్ల ప్రక్రియతో పోలిస్తే ఈ కార్లను వేగంగా మార్కెట్‌లోకి తీసుకురావడానికి ఈ పద్ధతి బ్రాండ్‌కు సహాయపడుతుంది. 2030 నాటికి 34 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలతో 750 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 5,564 బిలియన్) విలువైన మార్కెట్ విభాగంలోకి ప్రవేశించడం ఈ స్టార్టప్ లక్ష్యం.
బ్రాండ్ 22 మంది సభ్యుల బృందం ప్రస్తుతం ఆర్ అండ్ డి డిజైన్, ఏరోడైనమిక్స్, ఇంజనీరింగ్‌పై యూకే, జర్మనీ, యూఎస్ లో టెక్నాలజి భాగస్వాములతో పనిచేస్తోందని సంస్థ పేర్కొంది.