ఎలక్ట్రిక్ వాహనాలపై కొనుగోలుదారుల ఆసక్తి పెరుగుతున్నందున ఆటోమొబైల్ తయారీదారులు కొత్త మోడళ్లను పరిచయం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో స్ట్రోమ్ మోటార్స్ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు స్ట్రోమ్ ఆర్ 3 బుకింగులను ప్రారంభించింది. ఇందుకు రూ.10వేల టోకెన్ మొత్తాన్ని జమ చేయడం ద్వారా స్ట్రోమ్ ఆర్ 3ని ప్రీ బుక్ చేసుకోవచ్చు. స్ట్రోమ్ మోటార్స్ అనేది ముంబైకి చెందిన స్టార్ట్-అప్ సంస్థ, దీని ఎలక్ట్రిక్ కారు స్ట్రోమ్ ఆర్ 3ను 2018లో ప్రవేశపెట్టింది. ఒక నివేదిక ప్రకారం ఈ కారు ఇండియాలో చౌకైన ఎలక్ట్రిక్ కారు అవుతుంది.