జపాన్‌లో హోండా హెచ్ఆర్-వి ఎస్‌యువి 4 వేరియంట్లలో అందించబడుతుంది. జి, ఇ: హెచ్‌ఇవి ఎక్స్, ఇ: హెచ్‌ఇవి ఎక్స్, ఇ: హెచ్‌ఇవి జెడ్, ఇ: హెచ్‌ఇవి ప్లే.
కొత్త హెచ్‌ఆర్-వి హోండా ఇ: హెచ్‌ఇవి పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది, ఇందులో 1.5 ఎల్ పెట్రోల్ ఇంజన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ, గేర్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది.
హోండా హెచ్‌ఆర్-విలో కొత్త బలమైన హైబ్రిడ్ సిస్టం ఉంది, ఇది 109 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 9.5 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకోగలదు.
కొత్త 2021 హోండా హెచ్ఆర్-వి ఇంజన్ లో డ్రైవ్, ఎలక్ట్రిక్ డ్రైవ్, హైబ్రిడ్ డ్రైవ్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లను అందిస్తుంది.లీటరుకు 27.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని హోండా పేర్కొంది.
2021 హోండా హెచ్ఆర్-వి కూపే కారు రూపాన్ని కలిగిస్తుంది. కొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ఎస్, ఫ్రంట్ బంపర్లు, మంచి లుక్‌తో బోనెట్, స్పోర్టి ఫాగ్ లాంప్ లుక్ చాలా విలాసవంతమైన కారుగా చేస్తుంది.
ఈ ఎస్‌యూవీ సైడ్ ప్రొఫైల్‌కు బ్యాక్ డోర్ హ్యాండిల్‌తో సి-పిల్లర్ ఇచ్చారు. దీనితో పాటు లుక్‌లైన్స్, ఆకర్షణీయమైన వీల్ ఆర్చ్‌లతో డ్యూయల్-టోన్ మెషిన్ కట్ అల్లాయ్ వీల్స్, టర్న్ ఇండికేటర్స్‌తో డ్యూయల్ టోన్ ఓఆర్‌విఎంలు, సైడ్ బాడీ క్లాడింగ్‌తో డిజైన్ చేసి ఉంటుంది.
ఎస్‌యూవీ వెనుక భాగంలో ఎల్‌ఈడీ టైల్ లాంప్‌లు, అప్‌డేట్ చేసిన బంపర్‌లను రీడిజైన్ చేసింది.పాత మోడల్‌తో పోలిస్తే, కొత్త హోండా హెచ్ఆర్-వి 2021 పెద్దది అలాగే క్యాబిన్‌లో ఎక్కువ స్థలాన్ని అందించింది.
కొత్త 2021 హోండా హెచ్‌ఆర్‌వి క్యాబిన్ లోపల కూడా గణనీయమైన మార్పులు చేసింది.
2021 హోండా హెచ్ఆర్-వి చాలా ఫీచర్లను అందిస్తుంది. కొన్ని ముఖ్యమైన ఫీచర్ల గురించి మాట్లాడితే ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు సపోర్ట్ చేసే పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.
ఇవి కాకుండా 7-అంగుళాల టిఎఫ్‌టి, హోండా కనెక్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, రియర్ ఎసి వెంట్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేషన్ తో లెదర్ సీట్, రిమోట్ బూట్ ఓపెనింగ్, హిల్ డీసెంట్ కంట్రోల్, హోండా సెన్సింగ్ టెక్నాలజీ, యాక్టివ్ కార్నరింగ్ లైట్, బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.
కొత్త హోండా హెచ్ఆర్-వి 6 మోనోటోన్ పెయింట్ స్కీమ్ తో అందిస్తున్నారు. ఇందులో ప్రీమియం సన్‌లైట్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, ప్రీమియం క్రిస్టల్ రెడ్, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్, సాండ్ పెర్ల్, మెటోరైడ్ గ్రే ఉన్నాయి. వీటితో పాటు మిడ్నైట్ బ్లూతో సిల్వర్ రూఫ్, బ్లాక్ రూఫ్ తో పెర్ల్, బ్లాక్ విత్ సిల్వర్ రూఫ్, వైట్ అండ్ బ్లాక్ రూఫ్, గ్రే విత్ బ్లాక్ రూఫ్ తో సహా 5 డ్యూయల్ టోన్ షేడ్స్ కూడా ఈ ఎస్‌యూవీతో లభిస్తుంది.
అయితే భారతదేశంలో లాంచ్ గురించి అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. అయితే ఈ ఏడాది చివరి నాటికి హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీ భారత్‌కు రాబోతున్నట్లు ఒక నివేదిక తెలిపింది.
హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీ భారత మార్కెట్లో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, త్వరలో విడుదల కానున్న వోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ పోటీగా నిలుస్తుంది.