లుక్ అండ్ డిజైన్
కొత్త డుకాటి స్ట్రీట్‌ఫైటర్ వి2లో కనిపించే చాలా డిజైన్ ఎలిమెంట్స్ స్ట్రీట్‌ఫైటర్ వి4 సూపర్ నేకెడ్ బైక్ లో చూడవచ్చు. హెడ్‌ల్యాంప్ కౌల్ వి4లను పోలి ఉంటుంది, అంటే బ్యాట్ మాన్ సినిమాల్లో జోకర్ నవ్వుతున్న ముఖాన్ని పోలి ఉంటుంది. మస్కులర్ ఫ్యుయెల్ ట్యాంక్, చక్కగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్, రేడియేటర్ ష్రౌడ్, షార్ట్ టెయిల్ బైక్ కి స్ట్రీట్ నేక్డ్ లుక్‌కి జోడిస్తుంది. అల్లాయ్ వీల్స్ పానీగేల్ వి2ని పోలి ఉంటాయి ఇంకా పిరెల్లి డియబ్లో రోస్సో 4 టైర్ల లభిస్తాయి.
అయితే, స్ట్రీట్‌ఫైటర్ వి2 లో లేనిది రేడియేటర్ పక్కన ఉన్న బి-ప్లేన్ వింగ్స్. వీటిని డుకాటీ యాక్ససరీగా అందిస్తుంది. ఇవి ప్లాస్టిక్ లేదా కార్బన్ ఫైబర్‌తో తయారు చేసి ఉంటాయి. 265 kmph వద్ద 27 కిలోల డౌన్‌ఫోర్స్‌ను ఉత్పత్తి చేస్తాయి.
పానిగేల్ వి2 అండ్ స్ట్రీట్‌ఫైటర్ వి2 మధ్య ఉన్న ఇతర తేడా ఏమిటంటే లాంగ్ హ్యాండిల్‌బార్. ఫుట్‌పెగ్‌లు కొత్తగా ప్లేస్ చేశారు. ఇంకా మందమైన సీటుతో వస్తుంది. సీటు ఎత్తు 845ఎంఎం.
ఇంజిన్ అండ్ పవర్
డుకాటి స్ట్రీట్‌ఫైటర్ వి2 955 cc, సూపర్‌క్వాడ్రో, ట్విన్-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది, ఇంకా పనిగేల్ వి2 పోలి ఉంటుంది. ఈ ఇంజన్ 153 హెచ్‌పి పవర్, 101.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 24,000 కిమీల వద్ద డెస్మో సర్వీస్ అవసరం. ఈ ఇంజన్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. దీనిలో అప్/డౌన్ క్విక్‌షిఫ్టర్ స్టాండర్డ్ గా అందుబాటులో ఉంటుంది. పానిగేల్ వి2తో పోలిస్తే బైక్ రెస్పాన్స్ సమయాన్ని మెరుగుపరచడానికి ఫైనల్ రేషియో కొద్దిగా అడ్జస్ట్ చేశారు.
విలాసవంతమైన ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీ
ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీలో కార్నరింగ్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, ఇంజిన్ బ్రేకింగ్, త్రీ పవర్ మోడ్‌లు - హై, మీడియం, లో ఇంకా మూడు రైడ్ మోడ్‌లు - వెట్, రోడ్ అండ్ స్పోర్ట్ ఉన్నాయి. మోడ్‌లు, ఇతర సెట్టింగ్‌లను 4.3-అంగుళాల కలర్ టిఎఫ్‌టి క్లస్టర్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
భారతదేశంలో సస్పెన్షన్, బ్రేకింగ్, లాంచింగ్
వీల్స్
కొత్త స్ట్రీట్‌ఫైటర్ వి2 బైక్ లో కాస్ట్ అల్యూమినియం మోనోకోక్ ఫ్రేమ్‌ను పొందుతుంది, అయితే సబ్‌ఫ్రేమ్ ట్రేల్లిస్ యూనిట్‌గా ఉంటుంది. స్ట్రీట్‌ఫైటర్ వి2 సింగిల్ సైడెడ్ స్వింగ్‌ఆర్మ్ మెరుగైన బ్యాలెన్స్ కోసం పానిగేల్ వి2 కంటే 16 ఎంఎం పొడవుగా ఉంటుంది. బైక్ మొత్తం బరువు 178 కిలోలు అంటే పానిగేల్ V2 కంటే 2 కిలోలు ఎక్కువ.
సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్
సస్పెన్షన్ పానిగేల్ వి2 లాగానే ఉంటాయి. బైక్ ముందు భాగంలో అడ్జస్టబుల్ 43 ఎంఎం షోవా బిగ్ పిస్టన్ USD ఫోర్కులు, వెనుక వైపున Sachs మోనోషాక్ ఇచ్చారు. బ్రేకింగ్ గురించి మాట్లాడితే పానీగేల్ వి2 వంటి Brembo M4.32 మోనోబ్లాక్‌ను పొందుతుంది.
భారతదేశంలో లాంచ్ ఎప్పుడు
డుకాటి స్ట్రీట్ ఫైటర్ వి2 త్వరలో అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది అలాగే కొన్ని నెలల్లో భారతదేశంలో ప్రారంభించవచ్చు.