పండగ సీజన్లో ఈ బైకుకి భారీ డిమాండ్.. 100 డీలర్‌షిప్‌లలో 1,000 బైక్స్.. రికార్డు సెన్సేషన్ !

First Published | Oct 18, 2023, 7:56 PM IST

దసరా, దీపావళి పండుగను పురస్కరించుకుని హీరో మోటోకార్ప్ అక్టోబర్ 15 నుండి దేశవ్యాప్తంగా Harley-Davidson X440 పంపిణీని ప్రారంభించింది. అయితే 100 డీలర్‌షిప్‌లలో 1,000 బైక్‌లు అమ్ముడయ్యాయి. 
 

Harley-Davidson X440 బైకుని Harley-Davidson అండ్ Hero MotoCorp అవుట్‌లెట్‌లతో సహా 100 డీలర్‌షిప్‌లలో రికార్డు సృష్టించింది. దింతో 100 డీలర్‌షిప్‌లలో 1,000 హార్లే బైక్‌లు అమ్ముడయ్యాయి. 
 

జూలై 2023లో ప్రారంభించినప్పటి నుండి హార్లే-డేవిడ్‌సన్ X440 భారతదేశం అంతటా ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్‌లను ఆకర్షించింది, లాంచ్ చేసిన కేవలం ఒక నెలలోనే 25,000+ బుకింగ్‌లను పొందింది.  
 


Harley-Davidson X440ని ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్‌లోని నీమ్రానాలో ఉన్న హీరో మోటోకార్ప్  తయారీ కేంద్రంలో తయారు చేయబడింది - దీనిని గార్డెన్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు.

కొత్త కస్టమర్‌లు ఇప్పుడు Harley-Davidson X440ని టెస్ట్ రైడ్ చేయవచ్చు. అలాగే ఈ బైక్ ని అన్ని హార్లే-డేవిడ్‌సన్ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. 
 

harley-Davidson X440 డెనిమ్, వివిడ్ అండ్  ఎస్ అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ  బైక్ ధరలు (ఎక్స్-షోరూమ్)  :INR 2,39,500/- (డెనిమ్), INR 2,59,500/- (వివిడ్),  INR 2,79,500/- (S).

మేము పండుగ సీజన్‌లో మొదటి రోజున డెలివరీ చేయడం ప్రారంభించినప్పుడు మా కస్టమర్‌ల ముఖాల్లో ఆనందం ఇంకా  ఉత్సాహాన్ని చూసి మేము సంతోషించాము. మేము రాబోయే 4-5 నెలల్లో అన్ని డెలివరీలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మా సప్లయ్  చైన్ ఇప్పటికే   సామర్థ్యాన్ని పెంచే ప్రక్రియలో ఉంది. ఎందుకంటే, హార్లే డేవిడ్‌సన్‌ను పొందాలనుకునే కస్టమర్‌లు ఎక్కువసేపు వేచి ఉండకూడదనేది మా కోరిక' అని హీరో మోటోకార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా తెలిపారు.
 

టైర్ II నగరాలు, చిన్న పట్టణాలతో సహా దేశవ్యాప్తంగా మోటరింగ్ ఔత్సాహికులకు హార్లే-డేవిడ్‌సన్ బైక్ థ్రిల్‌ను అందుబాటులో ఉంచాలని మేము ఆశిస్తున్నాము. ఈ అద్భుతమైన ఫీట్‌ని సాధించినందుకు మొత్తం హీరో మోటోకార్ప్ అండ్  హార్లే-డేవిడ్‌సన్ ఫ్యామిలీ  అంకితభావం, అవిశ్రాంత ప్రయత్నాలను తప్పక అభినందించాలి అని అన్నారు. 
 

Latest Videos

click me!