ప్రధాని మోడీ వాడే బుల్లెట్ ప్రూఫ్ కారులో ఇన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయా..!

First Published | May 10, 2024, 11:53 PM IST

దేశంలో ఎలక్షన్స్ బెల్ మోగనున్న తరుణంలో గ్లోబల్ లీడర్‌గా వెలుగొందుతున్నభారతీయ ప్రధాని నరేంద్ర మోడికి హై సెక్యూరిటీ  కల్పించనున్నారు. దింతో గతంలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ప్రధాని కారు విధానాన్ని, సెక్యూరిటీ మార్చింది. అయితే మోడీ వాడుతున్న  బుల్లెట్ ప్రూఫ్ కారు గురించి ఆసక్తికరమైన సమాచారం మీకోసం.
 

ఎప్పటిలాగే ఈసారి కూడా భారత ప్రధాన మంత్రులకు గరిష్ట భద్రత కల్పించారు. ఇల్లు, ప్రయాణం, సందర్శనతో సహా ప్రతిచోటా గట్టి సెక్యూరిటీ  అందిస్తుంది. వీటిలో ప్రధాని మోదీకి బెదిరింపులు కూడా ఉండడంతో ఎన్ఎస్జీ కమాండోల డేగ కన్ను వేసి ఉంచారు.
 

అయితే ప్రధాని మోదీకి అత్యంత భద్రతతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ కారును ఇచ్చారు. ఈ కారు కాల్పులు, బాంబు దాడులతో సహా ఇతర  దాడుల నుండి రక్షణను అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, ప్రతిదాడిని చేయగల కెపాసిటీ  కూడా  ఉంటుంది.
 


తాజాగా ఈసారి మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ బుల్లెట్ ప్రూఫ్ కారును ప్రధాని మోదీకి అందించారు. 12 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేసే ఈ కారును ప్రధాని ప్రయాణ, భద్రతా అవసరాల కోసం మోడిఫై చేసారు.
 

మోడీ తరచుగా బ్లాక్ రేంజ్ రోవర్ సెంటినల్ కారులో కనిపిస్తుంటారు. దాదాపు 10 కోట్ల రూపాయల ధర ఉన్న ఈ కారు సెక్యూరిటీ ఫీచర్లతో లోడ్ చేసి ఉంటుంది.
 

ప్రధానంగా ప్రధాని, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చే కార్లను ప్రత్యేకంగా కస్టమైజ్ చేస్తారు. దీని భద్రతా ఫీచర్లు, ధరలపై ఖచ్చితమైన సమాచారం సీక్రెట్ గా ఉంటుంది.
 

2019లో మోదీ ఎక్కువగా టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారును ఉపయోగించారు. ఈ కారు ధర 2.5 కోట్ల రూపాయలు. కానీ సెక్యూరిటీ ఫీచర్ల తర్వాత కారు విలువపై స్పష్టమైన సమాచారం లేదు. మోడీ బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారును కూడా ఉపయోగించారు. దీనికి తోడు మోదీ టయోటా ఫార్చ్యూనర్ కారులోను ప్రయాణించారు. ప్రధాన మంత్రికి అందించిన కార్లన్నీ బుల్లెట్ ప్రూఫ్ అండ్  హై సెక్యూరిటీ అందిస్తాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం భారత ప్రధాన మంత్రులకు గరిష్ట భద్రత ఉన్న కార్లను అందించే విధానాన్ని తీసుకొచ్చింది. అయితే అది అనివార్యమైంది కూడా. 
 

Latest Videos

click me!