ఇప్పుడు ఎక్కువ మైలేజ్, మరిన్ని ఫీచర్స్.. మారుతి సుజుకీ కొత్త స్విఫ్ట్ ఈజ్ బ్యాక్..

First Published | May 10, 2024, 6:04 PM IST

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి కొత్త 2024 స్విఫ్ట్‌ను లాంచ్ చేసింది. ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిట్టి  కారు ప్రత్యేక ఫీచర్లు ఇప్పుడు వెల్లడయ్యాయి. 
 

 మారుతి సుజుకికి చెందిన ప్రముఖ కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఒకటి. దీని 4th జనరేషన్  కారుని రూ. 6.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో  ప్రవేశపెట్టారు.
 

Maruti Suzuki Swift

హ్యాచ్‌బ్యాక్ ప్రీమియం వేరియంట్ ధర రూ. 9.64 లక్షలు (ఎక్స్-షోరూమ్). మీరు నెలకు రూ.17,436 నుండి EMI మోడ్‌లో కూడా ఈ కారుని సొంతం చేసుకోవచ్చు.
 


Maruti Suzuki Swift

2024 మారుతి సుజుకి స్విఫ్ట్ కొత్త Z-సిరీస్ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌, మ్యాక్స్  82PS పవర్ , 113Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్ ట్రాన్స్‌మిషన్ అప్షన్స్  ఇంతకుముందులాగానే ఉంటాయి (5-స్పీడ్ MT అండ్  5-స్పీడ్ AMT).
 

Maruti Suzuki Swift

నాల్గవ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ మైలేజ్   ఇప్పుడు పెరిగింది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ మైలేజ్ 5-స్పీడ్ MT ఎడిషన్ 24.8 kmpl అందిస్తుందని, కాబట్టి, 5-స్పీడ్ AMT ఎడిషన్ 25.75 kmplని అందిస్తుందిని తెలిపారు. 
 

Maruti Suzuki Swift

2024 మారుతి సుజుకి స్విఫ్ట్ 40కి పైగా కనెక్టివిటీ అప్షన్స్ అందిస్తుంది. కొత్త స్విఫ్ట్ టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి కార్లకు గట్టి ఛాలెంజర్‌గా ఉంటుందని భావిస్తున్నారు.
 

Latest Videos

click me!