లేటెస్ట్ టెక్నాలజితో హోండా కొత్త వెర్షన్‌ జపాన్ ఎస్‌యూ‌వి.. దీని స్పెషాలిటీ, ఫీచర్స్ ఎంటో తెలుసా..?

First Published | Oct 4, 2021, 7:35 PM IST

జపాన్  ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా నుండి బి‌ఆర్-వి  (Honda BR-V)ఎస్‌యూ‌వి భారతదేశంలో పెద్దగా విజయవంతం కాలేదు, కానీ కొన్ని ఇతర ఆసియా మార్కెట్లలో అనుకూలంగా సక్సెస్ అయ్యింది. హోండా బి‌ఆర్-వి ప్రజాదరణను కొనసాగించే ప్రయత్నంలో తాజాగా కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. 

 ఈ కొత్త బి‌ఆర్-వి  సెకండ్ జనరేషన్ మోడల్  దీనిని ఎన్7ఎక్స్  కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. అయితే దీనిని ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రదర్శించారు. 


హోండా బి‌ఆర్-వి సెకండ్ జనరేషన్ ని కొత్త రూపంతో పరిచయం చేశారు, ఈ ఎస్‌యూ‌వి పాత మోడల్ కంటే భిన్నంగా ఉంటుంది. దీనిలో ఎన్నో లేటెస్ట్ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీని అందించారు.
 

ఇంజన్ అండ్ పవర్

కొత్త 2021 హోండా బి‌ఆర్-విలో 1.5-లీటర్ 4-సిలిండర్ i-VTEC పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఇండియా-స్పెక్ హోండా సిటీలో ఉపయోగించిన ఇంజన్ ఇదే. ఈ ఇంజన్ 6,600 రాం వద్ద 119 బి‌హెచ్‌పి శక్తిని, 4,300 ఆర్‌పి‌ఎం వద్ద 145 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో కొత్త సి‌వి‌టి ఆటోమేటిక్ అండ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్  అందించారు.


లూక్స్ అండ్ డిజైన్

కొత్త  బి‌ఆర్-వి   ఎన్7ఎక్స్ కాన్సెప్ట్‌తో సమానంగా కనిపిస్తుంది. కొత్త లుక్ లో ఈ ఏడు సీట్ల హోండా ఎస్‌యూ‌వి  పాత మోడల్‌కి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కొత్త బి‌ఆర్-వి   ఇప్పటికీ కొద్దిగా కర్వ్ సిల్హౌట్ ఉంది కానీ ముందు భాగంలో వైడ్ రేడియేటర్ గ్రిల్, చిసెల్డ్ బంపర్లు, ఎల్‌ఈ‌డి డి‌ఆర్‌ఎల్ లతో ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్‌లు కొత్త బి‌ఆర్-వి కి పూర్తిగా కొత్త గుర్తింపును ఇస్తాయి. సిటీ డ్రైవింగ్ కోసం రూపొందించబడినప్పటికీ, కొత్త బి‌ఆర్-వి సైడ్ క్లాడింగ్, రూఫ్ రైల్స్ కారణంగా కొంచెం బంపిగా కనిపిస్తుంది.

కొత్త బి‌ఆర్-వి పాత మోడల్ కంటే పెద్ద ఎస్‌యూ‌వి లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎస్‌యూ‌వి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పెరిగింది. కొత్త బి‌ఆర్-వి ఎత్తు 220 ఎం‌ఎం, అంటే పాత మోడల్ కంటే 20 ఎం‌ఎం ఎక్కువ. దీనిలో హోండా లేన్ వాచ్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, వాక్-అవే ఆటో లాక్, స్మార్ట్ ఎంట్రీ సిస్టమ్ వంటి ఫీచర్లు, టెక్నాలజీ ఉంది. 
 

ఫీచర్లు

ఈ కొత్త బి‌ఆర్-విలో కొత్త ఇంటీరియర్ లేఅవుట్ ఇచ్చారు. ఇంకా ఈ మూడు వరుసల ఎస్‌యూవీకి 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తుంది, దీనిని ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కనెక్ట్ చేయవచ్చు. దీనితో పాటు సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో 4.2-అంగుళాల టి‌ఎఫ్‌టి డిస్‌ప్లే, ఆటోమేటిక్ ఏ‌సి, ఆటో ఫోల్డబుల్ ఓ‌ఆర్‌వి‌ఎంలు వంటి ఫీచర్లు ఉన్నాయి. 
 

సేఫ్టీ ఫీచర్లు

కొత్త  బి‌ఆర్-విలో బ్లైండ్‌స్పాట్ డిటెక్షన్ కోసం లేన్-వాచ్ సిస్టమ్, ఆర్‌డి‌ఎం (రోడ్ డిపార్చర్ మిటిగేషన్), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో హై-బీమ్, కొలిజెన్ మిజిటేషన్ బ్రేకింగ్ సిస్టమ్, లేన్-కీపింగ్ అసిస్ట్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. దీనితో పాటు ఎయిర్‌బ్యాగులు, ఏ‌బి‌ఎస్, ఈ‌బి‌డి, రివర్సింగ్ కెమెరా వంటి ఇతర భద్రతా ఫీచర్‌లు కూడా అందించారు. 

భారతదేశంలో లాంచ్ ఎప్పుడు

ప్రస్తుతం హోండా కొత్త బి‌ఆర్-విని ఇండోనేషియా మార్కెట్ల కోసం మాత్రమే ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో కొత్త జనరేషన్ మోడల్‌ను భారతదేశంలోకి తీసుకురావడం పై  జపనీస్ కార్ల తయారీ సంస్థ ఎటువంటి సూచన ఇవ్వలేదు.

Latest Videos

click me!