ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేకుండా నడపవచ్చు.. ధర కూడా తక్కువే..

First Published Sep 30, 2021, 2:52 PM IST

 భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. దీనికి కారణం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ వాహనాల నుండి కాలుష్యం వ్యాప్తి చెందదు. కానీ రోడ్డుపై ద్విచక్ర వాహనాలు నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ (DL)అవసరం. అయితే కొంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల డ్రైవింగ్‌కు దూరంగా ఉంటారు. 

కానీ ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ వంటివి అవసరం లేకుండా నడపగల వాహనాలు దేశంలో చాలా ఉన్నాయి.
 

డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు అవసరం లేదు
మార్కెట్లో రెండు రకాల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఒకటి హై-స్పీడ్ మరొకటి లో-స్పీడ్ స్కూటర్లు. 250W మోటార్‌తో కూడిన తక్కువ పవర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు  బైకులకు డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ లేకుండా 25 kmph కంటే ఎక్కువ వేగంతో నడపవచ్చు. కానీ హై-స్పీడ్ వాహనాల కోసం ఈ  డాక్యుమెంట్స్ అవసరం అని గుర్తుంచుకోవాలి. 

మీకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేకుండా డ్రైవింగ్ చేయడానికి   మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లలు చాలా అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే కాకుండా మెరుగైన డ్రైవింగ్ రేంజ్‌ని ఇచ్చే బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మీకోసం...

 దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్  కొత్త  స్కూటి  హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఎల్ఎక్స్ ని అందిస్తుంది. ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్‌తో హీరో ఎలక్ట్రిక్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మాట్లాడితే హీరో ఎలక్ట్రిక్  ఫ్లాష్ ఎల్ఎక్స్ ఇ-స్కూటర్‌కు మంచి ప్రత్యామ్నాయం. ఈ ఇ-స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. ఇందులో కంపెనీ 250W ఎలక్ట్రిక్ మోటార్, 51.2V/30Ah బ్యాటరీ ప్యాక్ ఇచ్చింది. ఒక ఫుల్ ఛార్జ్‌తో స్కూటర్ 85 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోగలదు. దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 నుండి 5 గంటలు పడుతుంది. ఢిల్లీలో హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఎల్‌ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్  ఎక్స్-షోరూమ్ ధర రూ .56,940.

 లోహియా ఓమా స్టార్ లి 
లోహియా ఆటో ది లోహియా ఓమా స్టార్ లి ఎలక్ట్రిక్ స్కూటర్   సౌకర్యవంతమైన రైడ్, స్టేబిలిటీ కోసం ఎర్గోనామిక్ సీట్లు, స్టైలిష్ అల్లాయ్ వీల్స్  ఇచ్చారు. ఈ ఇ-స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు, కాబట్టి  దీనిని నడపడానికి  డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. ఈ స్కూటర్ లో 250W బి‌ఎల్‌డి‌సి ఎలక్ట్రిక్ మోటార్, 20Ah బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. కంపెనీ ప్రకారం, ఈ ఇ-స్కూటర్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీని బ్యాటరీని 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీనికి డ్రమ్ బ్రేక్‌లతో హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను పొందుతుంది.  లోహియా ఓమా స్టార్ లి ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ .51,750. 

ఒకినావా లైట్
ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా ఆకర్షణీయమైన డిజైన్‌తో అందిస్తున్నారు. ఈ ఇ-స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిమీ. ఈ స్కూటర్ 250W BLDC ఎలక్ట్రిక్ మోటార్, 1.25 KWH రిమూవబుల్  లిథియం-అయాన్ బ్యాటరీని పొందుతుంది. ఈ ఇ-స్కూటర్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 60 కిమీ వరకు ప్రయాణించవచ్చు. ఒకినావా లైట్ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 4-5 గంటల సమయం పడుతుంది. ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్‌లు, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈ‌డి టెయిల్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈ‌డి ఇండికేటర్స్,ఈ-ఏ‌బి‌ఎస్ రీజెనరేటివ్ బ్రేకింగ్, యూ‌ఎస్‌బి ఛార్జింగ్ పాయింట్ వంటి ఫీచర్లు స్కూటర్‌లో అందించారు. అలాగే ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ పొందుతుంది. ఢిల్లీలో ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 64,110. 
 

అత్యంత బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో డీటెల్ ఈజీ ప్లస్ చౌకైనది. డీటెల్ ఇటీవల బడ్జెట్ ఎలక్ట్రిక్ మోపెడ్ ఈజీ ప్లస్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ కొనాలనుకునే కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ .1,999 టోకెన్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇందులో 48V, 20Ah బ్యాటరీ ప్యాక్ ఉంది. సీటు కింద బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ 170ఎం‌ఎం బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్  ఉందని కంపెనీ చెబుతోంది. ఈ బైక్ పూర్తి ఛార్జింగ్ మీద 60 కి.మీ.ల దూరాన్ని కవర్ చేయగలదని కంపెనీ పేర్కొంది. జీఎస్టీ లేకుండా డీటెల్ ఈజీ ప్లస్ ధర రూ .39,999. 

ఆంపియర్ రియో ​​ఎలైట్
ఆంపియర్ వాహనాలు ప్రాథమికంగా గ్రీవ్స్ బ్రాండ్ అండ్ కంపెనీ గత కొంత కాలంగా దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. కంపెనీ రీయో ఎలైట్‌ను ఇటీవల ప్రారంభించింది. ఆంపియర్ రియో ​​ఎలైట్ సాంప్రదాయకంగా కనిపించే ఎలక్ట్రిక్ స్కూటర్. దీనికి హోండా డియో లాగా కనిపించే ఆప్రాన్ మౌంటెడ్ హెడ్‌ల్యాంప్‌ను పొందుతుంది. ప్రీమియం లుకింగ్ ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఫ్రంట్ ఆప్రాన్ పాకెట్, యూ‌ఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్‌ ఉంటాయి. 
 

ఆంపియర్ రియో ​​ఎలైట్ 250W బి‌ఎల్‌డి‌సి హబ్ మోటార్, 48V-27Ah బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఈ ఇ-స్కూటర్ గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ-స్కూటర్ లీడ్-యాసిడ్ అండ్ లిథియం-అయాన్ బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన వేరియంట్ పూర్తి ఛార్జ్‌లో 60 కి.మీ వరకు ప్రయానిస్తుంది. దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 8 నుండి 10 గంటలు పడుతుంది. కంపెనీ  బ్యాటరీపై 1 సంవత్సరం వారంటీ లభిస్తుంది. ఈ స్కూటర్ 4 రంగుల ఆప్షన్స్ లో వస్తుంది, ఇందులో షైన్ బ్లాక్, షైన్ వైట్, షైన్ రెడ్, షైన్ బ్లూ ఉన్నాయి. ఆంపియర్ రియో ​​ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధర రూ. 43,000.

 ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవింగ్ రేంజ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనం డ్రైవింగ్ పరిధి ఆపరేషన్ మోడ్, దానిపై లోడ్, రోడ్డు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

click me!