Hero VIDA VX2 vs Ola S1 Pro: హీరో విడా VX2, ఓలా S1 ప్రో.. రెండింటిలో ఏది బెస్ట్?

Published : Nov 23, 2026, 05:10 PM IST

Hero VIDA VX2 vs Ola S1 Pro: మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే హీరో విడా VX2, ఓలా S1 ప్రో బెస్ట్ ఆప్షన్. కానీ బ్యాటరీ, ఫీచర్లు, ధర, పనితీరు పరంగా ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఎవరు ఏ స్కూటర్ తీసుకుంటే లాభమో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
విడా VX2 vs ఓలా S1 ప్రో ఫీచర్లు

ఇండియన్ మార్కెట్లో ఆఫీస్ పనులకు, ఫ్యామిలీకి సరిపోయే రెండు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు హీరో విడా VX2, ఓలా S1 ప్రో. ఈ రెండింటి మధ్య గట్టి పోటీ ఉంది. హీరో స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంటే, ఓలా S1 ప్రో ఎక్కువ రేంజ్, ఎక్కువ స్పీడ్‌తో అట్రాక్ట్ చేస్తోంది.

24
హీరో విడా VX2 ఫీచర్లు

తక్కువ బడ్జెట్‌లో రిమూవబుల్ బ్యాటరీ కావాలనుకునే వారికి హీరో విడా VX2 బెస్ట్ ఆప్షన్. అపార్ట్‌మెంట్లలో ఉండేవారు ఈ బ్యాటరీని తీసి ఇంట్లో కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది 2.2 kWh నుంచి 4.4 kWh వరకు 4 బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. టాప్ మోడల్ ప్లస్ 4.4 kWh వేరియంట్ సింగిల్ ఛార్జ్‌పై 187 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

6 kW మోటార్ ఉన్న బేస్ మోడల్ టాప్ స్పీడ్ 70 కి.మీ కాగా, టాప్ మోడల్ స్పీడ్ 90 కి.మీ. నార్మల్ ఛార్జర్‌తో ఫుల్ ఛార్జ్ చేయడానికి 5 గంటలకు పైగా టైం పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 2 గంటల 28 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం ఛార్జింగ్ అవుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.10 లక్షల నుంచి రూ.1.61 లక్షల వరకు ఉంది.

34
ఓలా S1 ప్రో ఫీచర్లు

పెట్రోల్ బండ్లకు ఏమాత్రం తీసిపోని స్పీడ్, ఫీచర్లు కావాలనుకునే యువతకు ఓలా S1 ప్రో కరెక్ట్ గా సరిపోతుంది. ఇందులో ఫిక్స్‌డ్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి, పార్కింగ్ దగ్గరే ఛార్జింగ్ పెట్టుకోవాలి. 3 kWh బ్యాటరీ ఉన్న బేస్ మోడల్ 176 కి.మీ రేంజ్, 117 కి.మీ టాప్ స్పీడ్ ఇస్తుంది. అదే 5.2 kWh బ్యాటరీ ఉన్న టాప్ మోడల్ S1 ప్రో ప్లస్ ఏకంగా 320 కి.మీ మైలేజ్, 141 కి.మీ టాప్ స్పీడ్ ఇస్తుంది. 3 kWh మోడల్ 0 నుంచి 80 శాతం ఛార్జ్ అవ్వడానికి 7 గంటల సమయం తీసుకుంటుంది. టచ్ స్క్రీన్, నావిగేషన్ లాంటి ఎన్నో ఫీచర్లు ఉన్న ఈ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.31 లక్షలు.

44
రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్?

ధర పరంగా చూసుకుంటే ఓలా S1 ప్రో కంటే హీరో విడా VX2 ధర కాస్త తక్కువ. కానీ మైలేజ్, స్పీడ్ విషయంలో 320 కి.మీ రేంజ్‌తో ఓలా ముందంజలో ఉంది. ఇంట్లో పార్కింగ్ దగ్గర ఛార్జింగ్ పాయింట్ లేనివారు, అపార్ట్‌మెంట్లలో ఉండేవారు విడా VX2 ఎంచుకోవడం మంచిది. మంచి స్పీడ్, టచ్ స్క్రీన్ ఫీచర్లు, ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి ఓలా S1 ప్రో బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories