పండగ సీజన్ లో బైక్ కొనేవారికి షాకింగ్.. మరోసారి ఆ వాహన ధరల పెంపు..

First Published Sep 22, 2021, 12:04 PM IST

 ప్రపంచంతో పాటు దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (hero motorcorp) బైక్స్, స్కూటర్ల ధరలను మరోసారి పెంచింది. ఇప్పుడు హీరో మోటోకార్ప్ ద్విచక్ర వాహనాల ఎక్స్-షోరూమ్ ధర రూ .1000 నుండి రూ .3000కి పెరిగింది.పెరుగుతున్న వ్యయాల ప్రభావాన్ని తగ్గించడానికి వాహనాల ధరలను పెంచినట్లు కంపెనీ తెలిపింది. పెరిగిన ధరలు 20 సెప్టెంబర్ 2021 నుండి అమలులోకి వస్తాయి.

ఒక్క ఏడాదిలో మూడవసారి

2021 సంవత్సరంలో కంపెనీ వాహన ధరలను పెంచడం ఇది మూడోసారి. హీరో కంపెనీ జనవరిలో బైక్స్ అండ్ స్కూటర్ల ధరలను రూ .1500 వరకు పెంచింది. ఆ తర్వాత కంపెనీ ఏప్రిల్‌లో మరోసారి రూ. 2,500 పెంచింది. ధరల పెరుగుదల కంపెనీ అమ్మకాలపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు, ఒక విధంగా ఇప్పటికే ప్రభావితమైంది. హీరో మోటోకార్ప్ కి దేశవ్యాప్తంగా 100 మిలియన్ (10 కోట్లు) కంటే ఎక్కువ కస్టమర్లు ఉన్నారు.

ఎంత ధర పెరిగిందంటే ?

ఏ బైక్ ధర ఎంత పెరిగింది అనేది మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. నివేదిక ప్రకారం ఇప్పుడు హీరో చౌకైన బైక్ హెచ్‌ఎఫ్ 100  ఎక్స్-షోరూమ్ ధర రూ .49,900 నుండి రూ .50,900 కి పెరిగింది. ఆన్-రోడ్ ధర రూ .60,137 నుండి రూ .61,224 కి పెరిగింది. అంటే, ఇప్పుడు ఈ బైక్ కొనడానికి రూ. 1,087 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 

సేల్స్ ప్రభావితం అవుతాయా?

హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో ఎన్నో రకాల బైకులు, స్కూటర్ మోడళ్లను విక్రయిస్తుంది. ఆగష్టు నెలలో దేశీయ మార్కెట్‌లో కంపెనీ హోల్ సేల్ అమ్మకాలు 4,31,137 యూనిట్లకు గాను 2020 ఆగస్టులో 5,68,674 యూనిట్లకు గాను ఉన్నాయి. ధరలు పెరగడానికి ముడి పదార్థాల ధరలే ప్రధాన కారణమని  ఇందులో స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్ మరియు మెటల్ ఉన్నాయి అని తెలిపింది. గత ఏడాది కాలంలో వీటి ధరలు పెరగడంతో దీంతో వాహన తయారీదారులు బైక్స్  ధరలను కూడా పెంచింది. పెరుగుతున్న పెట్రోల్ ధరల మధ్య వాహనాలు మరోసారి ఖరీదైనవి కావడంతో వాటి అమ్మకాలను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు ఎలక్ట్రిక్ టూ వీలర్ల వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

click me!