దసరా, దీపావళి పండుగకి హీరో బంపర్ ఆఫర్.. ఇప్పుడు వీటిపై డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ స్కీం కూడా.. !

First Published | Oct 19, 2023, 6:33 PM IST

ఈ పండుగల సీజన్ కొత్త ఆనందం  తెచ్చింది. దసరా పండుగ తర్వాత  దీపావళి పండుగ కూడా వస్తోంది. దింతో హీరో మోటోకార్ప్ దీపావళి పండగకి గిఫ్ట్  స్కీం ప్రకటించింది. ఈ స్కీం ద్వారా ద్విచక్ర వాహనాలను కొనే   కస్టమర్లకు భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ అఫర్  లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ మాత్రమే.

హీరో 5,500 రూపాయల క్యాష్ బోనస్, 3,000 రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సహా ఎన్నో  డిస్కౌంట్ ఆఫర్‌లను ప్రకటించింది. సెలెక్ట్ చేసిన  బైక్‌లు అండ్  స్కూటర్‌లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

6.99 శాతం వడ్డీ రేటుతో ఈజీ  లోన్  ఫెసిలిటీ, అతి తక్కువ డౌన్ పేమెంట్, ఆధార్ కార్డ్ బేస్డ్ లోన్, జీరో హైపోథెకేషన్ ఫీజు, లో  అండ్  ఈజీ  ఈఎంఐ సదుపాయం ప్రకటించింది.

హీరో గిఫ్ట్ స్కీమ్ కింద స్కూటర్ లేదా బైక్ కొనే  కస్టమర్లకు ఎన్నో  బంపర్ ఆఫర్లు లభిస్తాయి. దీని ద్వారా హీరో కస్టమర్లను మరింతగా ఆకర్షిస్తుంది. దీపావళికి హీరో మోటోకార్ప్ హీరో డీలక్స్, హీరో స్ప్లెండర్ ఎక్స్‌టెక్, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్, ప్యాషన్ ప్లస్‌తో సహా కొన్ని ట్రిమ్ మోడల్‌లను కూడా విడుదల చేస్తోంది.


హీరోని నమ్మినందుకు కస్టమర్‌లకు మేము ఈ గిఫ్ట్  అందిస్తున్నాము. హీరో భారతదేశంలో  హోమ్ బ్రాండ్. కోట్లాది మంది కస్టమర్లను సంపాదించుకున్న హీరో ఇప్పుడు కస్టమర్లతో పండుగను జరుపుకుంటుందని హీరో బిజినెస్ హెడ్ రంజీవిత్ సింగ్ అన్నారు.
 

గిఫ్ట్ స్కీమ్ ద్వారా అనేక హీరో బైక్‌లను ఆఫర్ ధరలో అందిస్తున్నారు. దీంతో పాటు వారంటీ, సర్వీస్‌తో పాటు ఎన్నో  ఇతర ప్రయోజనాలను కస్టమర్లు పొందుతారని రంజీవిత్ సింగ్ తెలిపారు. మరింత పూర్తి సమాచారం కోసం మీ దగ్గరిలోని హీరో మోటోకార్ప్ లో సంప్రదించండి. 
 

Latest Videos

click me!