Fuel Saving Tips : పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా డోంట్ వర్రీ.. మీ డబ్బులు ఆదాచేసే 7 సూపర్ ట్రిక్స్

Published : Mar 06, 2026, 07:28 PM IST

ఇరాన్, ఇజ్రాాయెల్ మధ్య యుద్ద వాతావరణం, గల్ఫ్ దేశాల్లో అలజడి నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మీ ఇంధన ఖర్చులు తడిసిమోపెడు కాకుండా ఉండాలంటే కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి.

PREV
18
పెట్రోల్ భారం తగ్గించుకునే చిట్కాలు...

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. ప్రస్తుతానికి భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదు. కానీ యుద్ధం తీవ్రమైతే మాత్రం ఆయిల్ ధరలు పెరగొచ్చు. ఇలాంటి టైంలో మీ ఇంధన ఖర్చును తగ్గించుకోవడానికి ఈ 7 ట్రిక్స్ బాగా ఉపయోగపడతాయి.

28
బండిని బాగా మెయింటేన్ చేయాలి

బండి ఇంజిన్, టైర్లు సరైన కండిషన్‌లో ఉంటేనే మైలేజ్ బాగా వస్తుంది. అందుకే టైంకి ఇంజిన్ ఆయిల్ మార్చాలి. టైర్ ప్రెజర్‌ను కంపెనీ చెప్పినట్టు మెయింటెయిన్ చేయాలి. బండిపై దుమ్ము, ధూళి పెరిగితే గాలి నిరోధకత పెరిగి ఎక్కువ ఫ్యూయల్ కాలుతుంది. అందుకే బండిని శుభ్రంగా ఉంచుకోవాలి.

38
నిదానమే ప్రధానం..

సడన్‌గా బ్రేకులు వేయడం, వేగంగా నడపడం వల్ల ఫ్యూయల్ ఎక్కువ ఖర్చవుతుంది. అందుకే నెమ్మదిగా డ్రైవ్ చేయండి. వీలైనంత వరకు క్రూయిజ్ కంట్రోల్ వాడండి. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంటే ఇంజిన్ ఆఫ్ చేయడం మంచిది. దీనివల్ల ఇంధనం ఆదా అవుతుంది.

48
కార్ పూలింగ్...

మీరు రోజూ ఆఫీస్‌కు లేదా కాలేజీకి వెళ్తుంటే, మీ ఫ్రెండ్స్‌తో కలిసి కార్ పూలింగ్ చేసుకోండి. దీనివల్ల పెట్రోల్ ఆదా అవ్వడమే కాకుండా, రోడ్లపై ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. యాప్స్ ఉపయోగించి స్నేహితులను వెతికి, ఇంధన ఖర్చును పంచుకోవచ్చు.

58
దగ్గర్లో పనులకు నడక మంచిది..

చల్లగా ఉన్న ఇంజిన్‌తో చిన్న చిన్న ప్రయాణాలు చేస్తే ఎక్కువ ఫ్యూయల్ ఖర్చవుతుంది. అందుకే దగ్గర్లోని పనులకు నడిచి లేదా సైకిల్‌పై వెళ్లడానికి ప్రయత్నించండి. షాపింగ్ లేదా ఆఫీస్ కోసం వెళ్లేటప్పుడు పక్కా ప్లానింగ్‌తో డ్రైవ్ చేయండి.

68
క్వాలిటీ ఫ్యూయల్ వాడండి..

తక్కువ ధరకు ఫ్యూయల్ కొనడం ముఖ్యం కావొచ్చు, కానీ క్వాలిటీతో రాజీ పడొద్దు. నాసిరకం ఇంధనం ఇంజిన్‌ను పాడుచేయడమే కాకుండా, మైలేజ్‌ను కూడా తగ్గిస్తుంది. అందుకే నమ్మకమైన పెట్రోల్ బంకుల్లోనే బండిలో ఆయిల్ కొట్టించండి.

78
అవసరమైతేనే ఏసీ వాడండి..

ఏసీ, మ్యూజిక్ సిస్టమ్, లైట్లు ఎక్కువగా వాడితే ఫ్యూయల్ ఖర్చు పెరుగుతుంది. అందుకే అవసరాన్ని బట్టి మాత్రమే ఏసీ ఆన్ చేయండి… ఎక్కువ స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు కారు కిటికీలు మూసి ఉంచితే గాలి నిరోధకత తగ్గి ఇంధనం ఆదా అవుతుంది.

88
జిపిఎస్ వాడండి..

మీరు వెళ్లాల్సిన చోటుకు తక్కువ దూరం, తక్కువ ట్రాఫిక్ ఉన్న రూట్‌ను ఎంచుకోండి. జీపీఎస్, మ్యాప్ యాప్స్‌తో రియల్-టైమ్ ట్రాఫిక్ చూడండి. జామ్‌లు, పొడవైన మార్గాలను తప్పించడం వల్ల మీ పెట్రోల్ చాలా వరకు ఆదా అవుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories