కాలేజీ లేదా ఆఫీసుకు.. 100 కి.మీ మైలేజీ.. మహిళలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్..

First Published | May 28, 2024, 5:04 PM IST

స్టైలిష్, బడ్జెట్, పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా..? అయితే ముఖ్యంగా మహిళలకు ఆంపియర్ మాగ్నస్(Ampere Magnus) EX బెస్ట్  స్కూటర్ అనడంలో డౌట్  లేదు.
 

ఆంపియర్ మాగ్నస్ EX ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1200W BLDC మోటార్ ఉంది. ఈ మోటార్ గంటకు 40 కిలోమీటర్ల టాప్  స్పీడ్  అందిస్తోంది. ఈ స్కూటర్ 10 డిగ్రీల ఎత్తును(slope) సులభంగా ఎక్కగలదు.
 

ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇంకా సిటీలో చిన్న ప్రయాణాలకి అనువైనదిగా చేస్తుంది. ఆంపియర్ మాగ్నస్ EX మీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా అండ్  సురక్షితంగా చేస్తుంది.
 

ఈ స్కూటర్ ఎన్నో లేటెస్ట్ ఫీచర్లతో వస్తుంది. దారిలో మీ స్కూటర్ చెడిపోతే, కంపెనీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సర్వీస్ మీకు సహాయం చేస్తుంది.
 


మీరు మీ స్కూటర్ కోసం వర్చువల్ బార్డర్‌ను సెట్ చేయవచ్చు. అంటే స్కూటర్ మీ పరిధి నుండి బయటికి వెళితే, మీకు వార్నింగ్  వస్తుంది. యాంటీ థెఫ్ట్  అలారం మీ స్కూటర్‌ను దొంగతనం నుండి రక్షిస్తుంది.
 

స్కూటర్‌లో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ ఇంకా  టాకోమీటర్ వంటి గొప్ప డిజిటల్ డిస్‌ప్లే ఉంది. స్కూటర్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, టెయిల్‌లైట్,  టర్న్ సిగ్నల్ లైట్లు ఉన్నాయి.
 

స్కూటర్ సీటు చాలా సౌకర్యంగా ఉంటుంది. స్కూటర్‌లో సామాను కోసం ఇంటర్నల్  ప్లేస్ కూడా ఉంది. ఈ స్కూటర్‌ను కేవలం 4 నుండి 5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు.
 

ఆంపియర్ మాగ్నస్ EX ధర రూ.94,900 (ఎక్స్-షోరూమ్). బడ్జెట్  ఇంకా నమ్మదగిన స్కూటర్ కోసం చూస్తున్న మహిళలకు ఇది సరైనది.
 

Latest Videos

click me!