కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందిస్తున్నారు. అలాగే ప్రస్తుతం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, రైతుల రుణమాఫీ కూడా అమలవుతోంది.
గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికల వాగ్దానాలు చేసింది. ఇందులో బాలికలకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్ పథకం ఉంది. యువ మహిళా సాధికారత పథకం కింద చదువుకుంటున్న బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
18 ఏళ్లు నిండిన కాలేజ్ వెళ్లే ప్రతి బాలికకు ఎలక్ట్రిక్ స్కూటర్ అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందోనని పలువురు అంటున్నారు. ఎందుకంటే ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
బాలికలు విద్యాసంస్థలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఈ క్రమంలో మహిళలకి ఇక నుంచి ఉచిత స్కూటర్ పథకాన్ని అమలు చేయాలన్నారు. ఈ పథకం అమలైతే విద్యార్థులకు ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తుందనే దానిపై స్పష్టత లేదు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై ఇంకా ప్రకటన చేయలేదు. ఈ పథకం అమల్లోకి వస్తే 18 ఏళ్లు పైబడిన ప్రతి అమ్మాయికి ఉచితంగా ఈ-స్కూటర్ అందుతుందా ? లేదా ఎడ్యుకేషన్ రకం, కుటుంబ ఆదాయం మొదలైన పరిమితులను తీసుకువస్తుందా? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి.
అయితే, ఈ పథకం కింద అర్హత సాధించడానికి, కాలేజ్ అడ్మిట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన విద్యార్హత ఫ్రూప్స్ వంటి డాకుమెంట్స్ అవసరం కావచ్చు. అయితే, ఇప్పటికే స్కూటర్ ఉన్న వారికి ఈ పథకం వర్తించదు. ప్రభుత్వం తక్కువ స్పీడ్ తో కూడిన స్కూటర్లను అందజేస్తే డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.