అమెరికన్, యూరోపియన్ స్టయిల్ లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌ఈ విడుదల.. కొత్త లుక్, డిజైన్ చూసారా..

First Published Mar 10, 2021, 5:19 PM IST

అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ ఫోర్డ్  పాపులర్ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్  కొత్త ఎస్‌ఇ వేరియంట్‌ను బుధవారం ఇండియాలో  విడుదల చేసింది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్  ఎస్‌ఈలో  పెద్ద మార్పు ఏమిటంటే కారు వెనుక భాగంలో  అమర్చిన  స్టెప్ని వీల్ ను తొలగించింది. ఇప్పుడు ఈ స్థానంలో కారు టైర్  పంక్చర్ రిపేర్ కిట్ వస్తుంది, అవసరమైతే టైర్ తొలగించకుండానే పంక్చర్ చేయవచ్చు.

కొత్త లుక్ అండ్ డిజైన్కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌ఈ డిజైన్ అమెరికన్ అండ్ యూరోపియన్ మార్కెట్లలో విక్రయించే మోడళ్ల లాగా ఉంటుంది. ఈ మార్కెట్లలో విక్రయించే మోడళ్లలో బ్యాక్-మౌంటెడ్ స్పేర్ వీల్స్ ఉండదు. ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీకి కొత్త డ్యూయల్-టోన్ రియర్ బంపర్ లభిస్తుంది. దీని ముందు భాగంలో గ్రిల్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ లభిస్తాయి.
undefined
ఇంజన్కారు ఇంజన్ శక్తి గురించి చెప్పాలంటే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌ఈలో రెండు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. దీనిలో 1.5-లీటర్ 3-సిలిండర్ టివిసిటి పెట్రోల్ ఇంజన్ దాని విభాగంలో బెస్ట్ పవర్ ఔట్ పుట్ ఇస్తుంది. ఈ ఇంజన్ 122 పిఎస్ శక్తిని, 149 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ టిడిసి డీజిల్ ఇంజన్ 100 పిఎస్ పీక్ పవర్, 215 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి.
undefined
ఫీచర్స్ఎకోస్పోర్ట్ ఎస్‌ఈని టైటానియం ట్రిమ్‌లో కూడా ప్రవేశపెట్టింది. ఎకోస్పోర్ట్ ఎస్‌ఈ, టైటానియం వేరియంట్లు రెండూ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఈ‌బి‌డితో ఏ‌బి‌ఎస్, బ్యాక్ కెమెరా, వెనుక వైపర్స్ ఇంకా డీఫోగర్ వంటి భద్రతా ఫీచర్స్ అందించారు.
undefined
అయితే ఎకోస్పోర్ట్ టైటానియంలో ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, 9.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫోర్డ్‌పాస్ ఇన్-కార్ కనెక్టివిటీ టెక్నాలజీ, పవర్డ్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. మరోవైపు ఎకోస్పోర్ట్ ఎస్‌ఈకి టైర్ ప్రెజర్ మానిటర్, సింక్ 3 8.0 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఫోర్డ్ పాస్‌టిఎమ్ ఇంటిగ్రేషన్‌తో లభిస్తుంది, ఇది ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు సపోర్ట్ చేస్తుంది.
undefined
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ఇధరఇండియన్ కార్ల మార్కెట్లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ఇ పెట్రోల్ వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ .10.49 లక్షలు. డీజిల్ ఇంజన్‌ ఎక్స్‌ షోరూమ్ ధర రూ .10.99 లక్షలుగా నిర్ణయించారు.
undefined
undefined
click me!