సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య పేరు అమృత సింగ్, వీరికి ఒక కూతురు కూడా ఉంది, ఆమే పేరు సారా అలీ ఖాన్. అమృత సింగ్ తో విడాకులు తీసుకున్న తరువాత కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఒక్కటయ్యారు.
కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కలిసి మంగళవారం ముంబై వీధుల్లో ఒక కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కెమెరాకు చిక్కరు. ఇటీవల ఈ జంట ఒక కొత్త ఇంటికి కూడా మారారు. సైఫ్ అలీ ఖాన్ ఈ కారును తన భార్య కరీనాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం.
కెమెరాకు చిక్కిన ఫోటోలలో సైఫ్ అలీ ఖాన్ కారు నడుపుతున్నట్లు కనిపిస్తుంది. విషయం ఏంటంటే సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తాజాగా మెర్సిడెస్ బెంజ్ జి క్లాస్ కారును టెస్ట్ డ్రైవ్ తీసుకున్నారు. మీడియా కథనాల ప్రకారం ఈ జంట కొనుగోలు చేస్తున్న కారు విలువ సుమారు రూ.2.5 కోట్లు.
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ రెండవ కొడుకు పుట్టిన తరువాత మొదటిసారి కలిసి కెమెరాకి కనిపించారు. ఫిబ్రవరి 21న కరీనా కపూర్ తన రెండవ కొడుకికి జన్మనిచ్చింది.
కొడుకు పుట్టిన తరువాత సైఫ్ అలీ ఖాన్, కరీనా జంట బ్లాక్ మాస్కులు ధరించి వారి ఇంటి బయట కనిపించారు. ఈ సమయంలో సైఫ్ ఒక తెల్లటి టీ-షర్టు అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ కార్గో ప్యాంటుతో, కరీనా నీలిరంగు కఫ్తాన్ ధరించారు.
వుమెన్స్ డే సందర్భంగా కరీనా కపూర్ తన చిన్న కొడుకుతో కలిసి ఉన్న మొదటి ఫోటోని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్ నుండి షేర్ చేసింది. ఈ ఫోటోలో కరీనా స్త్రీలు చేయలేనిది అంటూ ఏది లేదు, అందరికీ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు.