Bike Riding Tips: వర్షాకాలంలో బైక్, స్కూటర్ నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. వర్షంతో తడిసిన రోడ్లు, నీటితో నిండిన గుంతలు, రోడ్లు జారుగా ఉండటం వల్ల ప్రమాదాల ముప్పు ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి.
వర్షాకాలంలో బైక్ పై వెళ్లేటప్పుడు ఈ తప్పులు చేయకండి.
వర్షాకాలంలో బైక్, స్కూటర్ నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. వర్షంతో తడిసిన రోడ్లు, నీటితో నిండిన గుంతలు, రోడ్లు జారుగా ఉండటం వల్ల ప్రమాదాల ముప్పు ఉంటుంది. రోడ్లు బాగా జారుతాయి. అందుకే, టూవీలర్ నడిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న అజాగ్రత్త కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. అందుకే, వానలో బైక్ లేదా స్కూటర్ మీద వెళ్లే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.
25
వర్షాకాలంలో బైక్, స్కూటర్ నడిపేవారు జాగ్రత్త
అన్నిటికంటే ముందు, టైర్ల కండిషన్ చెక్ చేసుకోవాలి. అరిగిపోయిన టైర్లు తడి రోడ్లపై పట్టు కోల్పోతాయి. టైర్ ట్రెడ్ సరిగ్గా ఉందో లేదో, గాలి ఒత్తిడి కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. అలాగే, బ్రేకులు కూడా సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ముందే టెస్ట్ చేయాలి. వానలో సడన్‌గా బ్రేకులు వేయకుండా, ముందు, వెనుక బ్రేకులను నెమ్మదిగా వాడటం చాలా సేఫ్.
35
వానలో బైక్ జారకుండా ఉండాలంటే ఏం చేయాలి?
వర్షం పడుతున్నప్పుడు మామూలు కంటే తక్కువ స్పీడ్‌లో వెళ్లడం మంచిది. ముందు వెళ్తున్న బండికి, మీకు మధ్య సరైన దూరం పాటిస్తే.. సడన్‌గా బ్రేకులు వేయాల్సిన అవసరం రాదు, గుంతల్ని కూడా తప్పించుకోవచ్చు. పగటిపూట కూడా హెడ్‌లైట్ ఆన్ చేసి ఉంచితే, మిగతా వాహనదారులు మిమ్మల్ని సులభంగా గమనిస్తారు. హెల్మెట్ వైజర్‌ను శుభ్రంగా ఉంచుకుంటే, వాన చుక్కలు లేదా పొగమంచు వల్ల చూపు మసకబారకుండా ఉంటుంది.
రోడ్లపై నీళ్లు నిలిచి ఉన్నచోట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నీటిలోపల గుంతలు లేదా తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్ ఉండొచ్చు. అవసరమైతే, నెమ్మదిగా వెళ్లండి. మధ్యలో బండి ఆపకుండా దాటేందుకు ప్రయత్నించండి. దీనివల్ల ఇంజిన్‌లోకి నీళ్లు వెళ్లే ప్రమాదం కూడా తగ్గుతుంది. వర్షాకాలం మొదలయ్యే ముందే బండికి పూర్తి సర్వీసింగ్ చేయించడం మంచిది. బ్యాటరీ, చైన్, లైట్లు, ఇండికేటర్లు, హారన్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. వానలో తడిచిన తర్వాత బండిని తుడిచి ఆరబెడితే, తుప్పు పట్టకుండా ఉంటుంది.
55
వర్షాకాలంలో బైక్ ప్రయాణం
బైక్‌పై వెళ్లేటప్పుడు మంచి క్వాలిటీ ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. దానితో పాటు గ్లోవ్స్, గట్టి షూస్, వర్షం నుంచి కాపాడే రెయిన్ కోట్ వేసుకుంటే మరింత భద్రతగాసురక్షితంగా ఉంటారు. తడి చెప్పులు లేదా స్లిప్పర్లు వేసుకుని బండి నడపడం అస్సలు మంచిది కాదు.