అయితే ఇందులో "నా ఉద్యోగాలను విడిచిపెట్టి, ఫుల్ టైం ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలని ఆలోచిస్తున్నాను" అంటూ ఎలోన్ మస్క్ కరణాన్ని వివరించకుండా ఒక ట్వీట్ చేస్తూ వెల్లడించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లో చాలా ఆక్టివ్ గా ఉండే ఎలోన్ మస్క్ తన స్థానం నుండి వైదొలగడం పట్ల ఎంత వరకు స్పష్టంగా ఉన్నారో తెలియలేదు.
రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ (SpaceX) స్థాపకుడు అండ్ సిఈఓ అలాగే బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ది బోరింగ్ కంపెనీకి నాయకత్వం వహిస్తున్న ఎలోన్ మస్క్ ఈ సంవత్సరం జనవరిలో జరిగిన ఒక కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడుతూ తాను "చాలా సంవత్సరాలు" టెస్లాకు సిఈఓగా ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
"వారానికి 7 రోజులు నేను లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు పగలు రాత్రి పని చేస్తుంటే.. నా చేతుల్లో కొంచెం ఖాళీ సమయం ఉంటే బాగుంటుంది." అని అన్నారు.
గత నెల ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో అతని వాటా నుండి 10% విక్రయించాలా అని ట్విట్టర్‌లో తన ఫాలోవర్స్ ని కోరారు దానికి మెజారిటీ ఫాలోవర్స్ అవును అనే అంగీకరించారు. అప్పటి నుండి అతను దాదాపు 12 బిలియన్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించాడు.