ఈవీ కార్లను స్లో/మోడరేట్ ఛార్జర్‌తో పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. ఫాస్ట్ ఛార్జర్ వాడితే సమయం తగ్గుతుంది. కానీ ఎంత వేగంగా ఛార్జ్ అవుతుందనేది కారు బ్యాటరీ, ఛార్జర్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.
భారత్‌లో ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వేగంగా విస్తరిస్తోంది. 2026 ఆగస్టు నాటికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 67,657 ఈవీ ఛార్జర్లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
క్లుప్తంగా చెప్పాలంటే..
పెట్రోల్ కారు = ఎక్కువ ఇంధనం + ఎక్కువ రొటీన్ మెయింటెనెన్స్
ఈవీ కారు = తక్కువ ఛార్జింగ్ ఖర్చు + తక్కువ రొటీన్ మెయింటెనెన్స్
మీ రోజువారీ ప్రయాణ దూరం, ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం, సుదూర ప్రయాణ అవసరాలు, బ్యాటరీ వారంటీ, మొత్తం ఖర్చు వంటివి లెక్కించుకుని కారు కొనడం ఉత్తమ నిర్ణయం అవుతుంది. వీటి ఆధారంగా పెట్రోల్ కారు బెటరా లేక ఈవి బెటరా మీరే నిర్ణయించుకోవచ్చు.