Budget EV Cars : టాటా టియాగో vs సిట్రోయెన్ eC3X .. కారు చవక ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ కారు ఏది?

Published : Jun 19, 2026, 03:16 PM IST

భారతదేశ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో సిట్రోయెన్ eC3X, టాటా టియాగో ఈవీ మధ్య గట్టి పోటీ నెలకొంది. వీటి ధర, రేంజ్, ఫీచర్లు, స్పేస్, బ్యాటరీ వంటి పూర్తి వివరాలను ఇక్కడ పోల్చి చూద్దాం.

PREV
16
చౌకైన ఎలక్ట్రిక్ కార్లు..

ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ కార్లు కొనేవాళ్లు తగ్గుతున్నారు… EV కొనేవాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ తన eC3 మోడల్‌ను eC3X పేరుతో కొత్తగా ఇండియాకు తీసుకొచ్చింది. ఇదే సమయంలో ఇండియన్ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా తన పాపులర్ టియాగో ఈవీకి కొత్త లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు జోడించి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీంతో ప్రస్తుతం తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వాళ్లకు ఈ రెండూ బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి.

26
టాటా టియాగో vs సిట్రోయెన్ eC3X

సిట్రోయెన్ eC3X ఎస్‌యూవీ లాంటి ఎత్తైన డిజైన్‌తో రోడ్డుపై ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ దీని లుక్‌ను మరింత పెంచుతున్నాయి.

మరోవైపు టాటా టియాగో ఈవీ కొత్త ఫ్రంట్ డిజైన్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ రియర్ ఎల్ఈడీ లైట్స్, డ్యూయల్-టోన్ రూఫ్, కొత్త వీల్ డిజైన్‌తో మోడ్రన్ హ్యాచ్‌బ్యాక్ లుక్‌లో ఆకట్టుకుంటోంది.

36
రేంజ్, ప్రయాణ అనుభవం

బ్యాటరీ కెపాసిటీ, రేంజ్ విషయంలో సిట్రోయెన్ eC3X కొంచెం ముందుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 320 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. 

టాటా టియాగో ఈవి గరిష్ఠంగా 285 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. పేపర్‌పై ఈ తేడా పెద్దగా అనిపించినా సిటీ ప్రయాణాలకు, అప్పుడప్పుడు చేసే లాంగ్ ట్రిప్పులకు రెండు కార్లు సరిపోతాయి.

46
స్పేస్, ఫ్యామిలీ వినియోగం

సిట్రోయెన్ eC3X పొడవైన వీల్‌బేస్, విశాలమైన క్యాబిన్‌ను కలిగి ఉంది. దీనివల్ల వెనుక సీట్లో కూర్చునే వారికి ఎక్కువ లెగ్‌రూమ్, సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తుంది. తరచుగా ఫ్యామిలీతో ప్రయాణించే వారికి ఇది మంచి ఆప్షన్. 

ఇక టాటా టియాగో ఈవి ఒక కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కావడంతో సిటీలోని ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ చేయడానికి, పార్కింగ్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది.

56
ఫీచర్లలో ఎవరు టాప్?

సౌకర్యాలు, టెక్నాలజీ ఫీచర్ల విషయంలో టాటా టియాగో ఈవీ స్పష్టంగా పైచేయి సాధించింది. ఇందులో 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్, కనెక్టెడ్ కార్ టెక్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. 

సిట్రోయెన్ eC3Xలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, హై-క్వాలిటీ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి రోజువారీ అవసరాలకు కావాల్సిన ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

66
సిట్రోయెన్, టియాగో ధరలు ఎలా ఉన్నాయి?

సిట్రోయెన్ eC3X ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.10.25 లక్షలు. బ్యాటరీ సర్వీస్ ప్లాన్‌ను ఎంచుకుంటే ప్రారంభ ధర రూ.6.89 లక్షలకు తగ్గుతుంది. టాటా టియాగో ఈవీ ప్రారంభ ధర రూ.6.99 లక్షలు కాగా, బ్యాటరీ సర్వీస్ ప్లాన్‌తో రూ.4.69 లక్షలకే లభిస్తుంది.

మొత్తంగా ఎక్కువ స్పేస్, ఎస్‌యూవీ లాంటి లుక్, ఫ్యామిలీ ప్రయాణాలకు సౌకర్యం కోరుకునే వారికి సిట్రోయెన్ eC3X సరైన ఎంపిక. కానీ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీ, డబ్బుకు పూర్తి విలువ కావాలనుకునే కస్టమర్లకు టాటా టియాగో ఈవీ బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories