ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్‌తో భారతదేశపు మొట్టమొదటి కారు.. దీని ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అనాల్సిందే..

First Published | Sep 8, 2021, 12:23 PM IST

ఫ్రెంచ్ ప్రముఖ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్  మొట్టమొదటి కారు సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఢిల్లీలో సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూ‌వి ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ .29.90 లక్షలు. 

ఇప్పుడు ఈ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ భారత వినియోగదారుల కోసం సబ్ కాంపాక్ట్ సెగ్మెంట్‌లో మరో చిన్న ఎస్‌యూవీని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది,  అదే సిట్రోయెన్ సి3, దీని ధర చాలా తక్కువ. నివేదిక ప్రకారం, కంపెనీ దీనిని సెప్టెంబర్‌లో ప్రారంచనుంది. ప్రత్యేకమైన విషయం ఏంటంటే భారతీయ మార్కెట్‌లో ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌తో వచ్చిన మొట్టమొదటి కారు ఇదే కావచ్చు.

సంస్థ సెప్టెంబర్ 16న సిట్రోయెన్ సి3 ఎస్‌యూ‌విని ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టనుంది. సిట్రోయెన్ సి3 సబ్-కాంపాక్ట్ ఎస్‌యూ‌వి కార్లు భారతదేశంలోనే ఉత్పత్తి చేయనున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా  లాంచ్ తేదీని వాయిదా వేయాల్సి వచ్చింది. ఇంతకుముందు కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి దీనిని మార్కెట్లో విడుదల చేయలనుకుంది. కాని ఇప్పుడు దీని అమ్మకాలు వచ్చే ఏడాది ప్రారంభంలో అంటే 2022లో భారతీయ మార్కెట్‌లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారతదేశంలో సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూ‌వి ధర కాస్త ఎక్కువగా ఉండవచ్చు.


ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ అంటే ఏమిటి ?

ముందుగా ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఇది సాధారణ ఫ్యూయల్ కంబాషన్ ఇంజన్ (ICE) ఇంజన్‌తో సమానంగా ఉంటుంది. కానీ ఈ కారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల ఇంధనంపై పనిచేయగలదు. కొన్ని సందర్భాలలో ఈ ఇంజిన్‌లో మిశ్రమ ఇంధనం కూడా ఉపయోగించవచ్చు. సాధారణ భాషలో చెప్పాలంటే ఈ ఇంజిన్‌లో పెట్రోల్, ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమాన్ని కూడా ఈ కారులో ఇంధనంగా ఉపయోగించవచ్చు. ఇంధన మిశ్రమం సెన్సార్ ఈ ఇంజిన్‌లో ఉపయోగించారు, ఇది ఇంధనానికి అనుగుణంగా కారును సెల్ఫ్ అడ్జస్ట్ చేస్తుంది. 

ఇంజన్ అండ్ పవర్

నివేదికల ప్రకారం సిట్రోయెన్ సి3 ఎస్‌యూ‌వి ఇంజన్ ఇథనాల్ ఆధారిత ఇంధనంతో పని చేయగల ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌ను ఉపయోగింవచ్చు. అంతేకాకుండా ఈ ఎస్‌యూవీలో కంపెనీ 1.6 లీటర్ 4-సిలిండర్ న్యాచురల్ అస్పిరేటెడ్ ఇంజన్ ఇవ్వవచ్చు, 118 bhp శక్తిని, 158 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కి 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో రవొచ్చు. 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందించే టర్బోచార్జ్డ్‌తో 1.2-లీటర్‌కు ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ శక్తినిచ్చే అవకాశం ఉంది. 

నివేదికలు నిజమైతే భారతీయ రోడ్లపై ఇలాంటి ఇంజిన్‌ తో నడిచే సిట్రోయెన్ సి3 మొట్టమొదటి కారు అవుతుంది, కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రత్యామ్నాయ ఇంధనంతో పనిచేసే కారుగా ప్రచారం చేయాలనుకుంటుందని నితిన్ గడ్కరీ ప్రకటించారు . కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల భారతదేశంలోని కార్ల తయారీదారులు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వంటి ఇంధనాలకు అనుకూలమైన ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లతో వాహనాలను ఉత్పత్తి చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. కార్ల తయారీదారులు ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ వాహనాలను కలిగి ఉండడాన్ని తప్పనిసరి చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని గడ్కరీ చెప్పారు. బ్రెజిల్, కెనడా, యునైటెడ్ స్టేట్స్‌లో ఇటువంటి ఇంజన్లు ఇప్పటికే విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. 

ప్రత్యేకంగా రూపొందించి

సిట్రోయెన్ సి3 సరికొత్త కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (CMP) పై నిర్మించే మొదటి కారు. సిట్రోయెన్ సి3 ఎస్‌యూ‌వి ధరను సాధ్యమైనంత తక్కువగా ఉంచాలని యోచిస్తోంది. దీని కోసం కార్ల తయారీ సంస్థ  స్థానిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సి3 ని అభివృద్ధి చేయడానికి టాటా ఇంజనీర్లకు CMP ప్లాట్‌ఫారమ్‌ను విడదీసే మిషన్‌ను అప్పగించారు. నిజానికి, ఇటీవల ప్రవేశపెట్టిన టాటా పంచ్ టెక్నికల్ గా సి3 మోడల్  కి కజిన్ అని కూడా పిలువవచ్చు.
 

ధర ఇంకా పోటీ

కంపెనీ సిట్రోయెన్ సి3 ఎస్‌యూ‌విని భారతదేశంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. లాంచ్ తర్వాత సిట్రోయెన్ సి3 మారుతి వితారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూ‌వి300, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, టయోటా అర్బన్ క్రూయిజర్   వంటి కార్ల నుండి ఇండియన్ మార్కెట్లో అత్యంత పోటీతత్వ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పోటీపడుతుంది. 

Latest Videos

click me!