కారులో ఎయిర్ బ్యాగ్స్ పై కేంద్రం కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి అమలు..!

First Published | Mar 5, 2021, 12:11 PM IST

ఈ రోజుల్లో కారు ప్రతిఒక్కరికీ సర్వసాధారణం.. కారులో సాయంత్రం వేళలో లేదా వీకెండ్ సమయంలో  షికారుకెళ్లడం ప్రతీ ఒక్కరికి సరదానే కొందరు ఆఫీస్ అవసరానికి కారును వినియోగిస్తుంటే మరికొందరు  విలాసానికి వినియోగిస్తుంటారు. అయితే కారు ప్రయాణాన్ని మరింత సేఫ్‌గా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త  కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకురానుంది. 
 

ఇకపై ముందు వరుస సీట్లకు ఎయిర్ బ్యాగ్స్‌ను తప్పనిసరి చేయనుంది. డ్రైవర్ పక్కన ఉన్న వాహనం ముందు సీటులో ప్రయాణీకులకు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి చేయాలని రహదారి రవాణా మంత్రిత్వ శాఖ గతంలోనే ప్రతిపాదించింది. ఏప్రిల్ 2021 నుండి కొత్త మోడళ్లకు, జూన్ 2021 నుండి ప్రస్తుత మోడళ్లకు ఎయిర్‌బ్యాగ్ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు మంత్రిత్వ శాఖ జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ తెలిపింది.
ఈ నిబంధనకు సంబంధించి సూచనలు సలహాలు ప్రజాల నుండి ఇమెయిల్ ద్వారా అభ్యర్థించారు.డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన ధరల పెరుగుదలకు దారి తీస్తుందని, అమ్మకాలపై ప్రభావాన్ని నివారించడానికి వాహన తయారీదారులు ఖర్చులు భారీగా పెంచాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) మంగళవారం తెలిపింది.

దేశ పౌరులకు డ్రైవింగ్‌ను సురక్షితంగా చేయాలనే ప్రభుత్వ దృష్టి ప్రశంసించబడుతున్నప్పటికీ, ఇది ఖచ్చితంగా వాహనాల ధరను పెంచుతుందని ఆయన అన్నారు. బిఎస్- VI ఉద్గార నిబంధనల అమలు కూడా ధరల పెరుగుదలకు దారితీసిందని ఆయన అన్నారు.
ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు పంపించగా వాటిని న్యాయ మంత్రిత్వ శాఖ అంగీకరిస్తు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో ఇక నుంచి డ్రైవర్‌‌తో పాటు పక్కసీటులో ఉండే ప్రయాణికుడి వైపు కూడా ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి కానున్నాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి రానుంది.
దీనిపై అధికారికంగా నోటిఫికేషన్ ‌మరో మూడు రోజుల్లో వెలువడనున్నట్లు సమాచారం. కాగా, భారత్‌ దేశంలో ప్రయాణికుల భద్రతా విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఇటీవల కేంద్రం రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.
కార్లలో రెండు ఎయిర్ బ్యాగ్స్ నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా కార్లలో ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేయనుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నాలుగు చక్రాల వాహనాలకు డ్రైవర్‌ వైపు ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి. దీంతో ప్రమాద సమయంలో డ్రైవర్‌ తప్పించుకొన్నా సహ ప్రయాణికుడి ప్రాణాలు ప్రమాదంలో పడవచ్చు. ఈ నేపథ్యంలోనే కేంద్రం రెండు ఎయిర్ బ్యాగ్స్ నిబంధనను తీసుకురానుంది.

Latest Videos

click me!