ఆనంద్ మహీంద్రా టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ ట్వీట్ ని ఏకీభవిస్తు, కార్ల తయారీదారులకు ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ ముందుకు సాగుతున్నారని చెప్పారు. "మేము దీనిని దశాబ్దాలుగా చేస్తున్నాము. ఇప్పటికీ శ్రమించడం, కష్టపడటం ఇది అంతా మా జీవన విధానం ..." అంటూ పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్ర చేసిన ఈ ట్వీట్ 4,900 'లైక్‌లు', ఎన్నో కామెంట్లను సంపాదించింది.