Car Mileage Tips : కారు ఏ స్పీడ్ లో నడిపితే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది? తెలుసుకుంటే పెట్రోల్ ఖర్చులు కంట్రోలే..!

Published : Jul 18, 2026, 02:57 PM IST

మీ కారు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలంటే దాని స్వీట్ స్పాట్ తెలుసుకోవడం చాలా కీలకం. మీ పెట్రోల్, డీజిల్ ఖర్చును సగానికి తగ్గించే రహస్యమే ఈ 'స్వీట్ స్పాట్' వేగం. ఇలాంటి కార్ మైలేజ్ టిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
అసలు స్వీట్ స్పాట్ అంటే ఏమిటి?

పెట్రోల్, డీజిల్ ధరలు రోజరోజుకి పెరగడమే తప్ప తగ్గడం లేదు.. దీంతో కారు ఉన్న చాలామందికి మైలేజ్ గురించి బెంగ పట్టుకుంది. కారు కొనేటప్పుడు మైలేజ్ గురించి తెలుసుకోవడం సహజం... మరి కంపెనీ చెప్పినంత మైలేజ్ రావడం లేదని చాలామంది బాధపడుతుంటారు. కానీ కారు మైలేజ్ అనేది ఇంజిన్‌ పైనే ఆధారపడదు... మనం నడిపే విధానం, ముఖ్యంగా వేగంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వేగంగా వెళ్తే గమ్యానికి త్వరగా చేరొచ్చు... కానీ జేబుకు చిల్లు పడుతుంది. నెమ్మదిగా నడిపినా ఇంధనం వృథా అవుతుంది. మరి ఎక్కువ మైలేజ్ కోసం సరైన వేగం అంటూ ఏదైనా ఉందా? అంటే కచ్చితంగా ఉంది, దాన్నే 'స్వీట్ స్పాట్' అంటారు.

24
మంచి మైలేజ్ కావాలంటే ఈ స్పీడ్ మెయింటేన్ చేయండి

ప్రతి కారు ఇంజిన్ ఒక నిర్దిష్ట వేగంతో నడిచినప్పుడే అత్యంత సమర్థంగా పనిచేస్తుంది, తక్కువ ఇంధనాన్ని వాడుకుంటుంది. సాధారణంగా గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు చాలా కార్లు మంచి మైలేజ్ ఇస్తాయని నిపుణులు చెబుతారు. కానీ ఇది అన్ని కార్లకూ వర్తించదు. మీ కారు ఇంజిన్ రకం (పెట్రోల్, డీజిల్), దాని గేర్‌బాక్స్, కారు బరువును బట్టి ఈ 'స్వీట్ స్పాట్' వేగం మారుతుంది. ఉదాహరణకు ఒక చిన్న హ్యాచ్‌బ్యాక్ కారుకు సరైన వేగం, ఒక పెద్ద SUV కారుకు ఉండే వేగానికి కచ్చితంగా తేడా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే మీ కారు ఇంజిన్‌పై ఎప్పుడు తక్కువ ఒత్తిడి పడుతుందో, అప్పుడే అది తక్కువ ఇంధనాన్ని తాగుతుంది... ఎక్కువ మైలేజ్ ఇస్తుంది... ఇంధన ఖర్చులు ఆదా అవుతాాయి.

34
కారు స్వీట్ స్పాట్ కనుక్కోవడం ఎలా?

మీ కారుకు సరైన 'స్వీట్ స్పాట్' వేగాన్ని కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటి ఆధునిక కార్లలో 'రియల్-టైమ్ మైలేజ్ ఇండికేటర్' అనే ఫీచర్ ఉంటుంది. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఆ క్షణంలో మీ కారు ఎంత మైలేజ్ ఇస్తుందో ఇది స్క్రీన్‌పై చూపిస్తుంది. తర్వాతిసారి హైవేపై వెళ్తున్నప్పుడు, ఈ ఇండికేటర్‌ను గమనించండి. ఏ గేర్‌లో, ఏ వేగంతో వెళ్తున్నప్పుడు మైలేజ్ అంకె ఎక్కువగా చూపిస్తుందో, అదే మీ కారు 'స్వీట్ స్పాట్'.

ఒకే వేగంతో, సడన్ బ్రేకులు, ఆక్సిలరేషన్ ఇవ్వకుండా నడిపితే, ఇంధనం ఆదా అవ్వడాన్ని మీరే గమనించవచ్చు. కాబట్టి, నెక్స్ట్ టైమ్ కారు తీసినప్పుడు కేవలం వేగాన్నే కాదు, సరైన వేగాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది మీ ప్రయాణ సమయాన్ని పెద్దగా ప్రభావితం చేయదు, కానీ మీ నెలవారీ ఇంధన ఖర్చులో మాత్రం కచ్చితంగా పెద్ద మార్పును తెస్తుంది. చివరగా కారును ఎంత స్మూత్‌గా, ప్రేమగా డ్రైవ్ చేస్తే... అది మీకు అంతటి మంచి మైలేజీని రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తుంది.

44
మంచి మైలేజ్ కోసం మరిన్ని టిప్స్

సరైన RPM వద్ద గేర్లు మార్చడం : ఇంజిన్‌పై ఎక్కువ భారం పడకుండా ఉండాలంటే RPM (Revolutions Per Minute) చాలా ముఖ్యం. పెట్రోల్ కార్లలో 1,500 నుంచి 2,000 RPM మధ్య, డీజిల్ కార్లలో 2,000 RPM లోపు తర్వాతి గేర్‌కు మారడం వల్ల మైలేజ్ గణనీయంగా పెరుగుతుంది.

టాప్ గేర్ వాడకం : తక్కువ వేగంతో టాప్ గేర్‌లో వెళ్లడం లేదా ఎక్కువ వేగంతో తక్కువ గేర్‌లో వెళ్లడం మైలేజ్‌ను దారుణంగా దెబ్బతీస్తుంది. 70-90 కి.మీ వేగంతో వెళ్తున్నప్పుడు కారు టాప్ గేర్‌లో (5వ లేదా 6వ గేర్) ఉండటం అవసరం.

సిగ్నల్స్ దగ్గర ఇంజన్ ఆఫ్ చేయడం : ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర 30 సెకన్ల కంటే ఎక్కువ సమయం ఆగాల్సి వస్తే, ఇంజన్ ఆఫ్ చేయడం వల్ల ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ ట్రిక్ బాగా పనిచేస్తుంది.

అనవసరపు బరువు తగ్గించండి : కారు డిక్కీలో అవసరం లేని భారీ వస్తువులను తీసేయండి. కారు బరువు పెరిగే కొద్దీ మైలేజీ తగ్గుతుంది. కారు పైన లగేజ్ క్యారియర్లు (Roof Racks) అవసరం లేనప్పుడు తీసేయడం మంచిది... దీంతో బరువు తగ్గడమే కాదు కారు వేగానికి గాలిని అడ్డుకుని మైలేజీ తగ్గకుండా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories