ఆఫీస్ లో ఉండే సౌకర్యాలు కొన్ని సంధర్భాలలో ఇంట్లో ఉండవు. తాజాగా దీనిని దృష్టిలో పెట్టుకొని కార్ల తయారీ సంస్థ నిస్సాన్ కదిలే కార్యాలయాన్ని డిజైన్ చేసింది. దీనికి ఆఫీస్ పాడ్ అని పేరు కూడా పెట్టారు. ఇందులో మీరు ప్రయాణించేటప్పుడు మీరు మీ ఆఫీస్ పనిని కూడా చేసుకోవచ్చు.
ఆఫీస్ పాడ్ అనేది మీ కార్యాలయాన్ని కారు రూపంలో మలుస్తుంది. దీనిలో అమెరికన్ ఫర్నిచర్ తయారీ సంస్థ హర్మన్ మిల్లెర్ చేత తయారు చేయబడిన ఆఫీస్ కుర్చీ కూడా ఉంది. డెస్క్ స్థలం కూడా పెద్ద కంప్యూటర్ మానిటర్ కోసం సరిపోతుంది.
ఈ నిస్సాన్ కొత్త కాన్సెప్ట్ క్యాంపర్ వ్యాన్, రిమోట్ వర్క్ చేసే వారి కోసం హోమ్ ఆఫీస్‌గా మారుతుంది. అంతేకాదు ప్రజలు దీన్ని చాలా ఇష్టపడతారు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే కారులో పని చేయడంతో పాటు కారు పైకప్పుపై కూడా మీరు పని చేయవచ్చు.
ఈ వాహనంతో మీరు మీ కార్యాలయాన్ని తీసుకొని ఎక్కడి నుండైనా పని చేయవచ్చు. జపాన్ కార్ల తయారీ సంస్థ కొన్ని రోజుల క్రితం టోక్యో వర్చువల్ ఆటో షోలో ఈ ప్రత్యేకమైన కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది.
నిస్సాన్ మోటార్ ఎన్వి 350 కారవాన్ అనేది ఆఫీసు పాడ్ కాన్సెప్ట్, దీనిని వ్యాన్ వలె నిపుణుల కోసం రూపొందించబడింది. ఇది కార్యాలయానికి దూరంగా పనిచేసేవారికి, అలాగే ఆఫీసు అనుభూతి చెందుతు ప్రయాణించాలనుకునే వారికి ఆకర్షణీయంగా ఉంటుంది.