ట్విట్టర్ యూజర్లకు ఆనంద్ మహీంద్రా సూటి ప్రశ్న.. మరో ఛాన్స్ అతనికి ఇవ్వొచ్చా అంటూ పోస్ట్..

First Published | Dec 10, 2021, 4:07 PM IST

బెటర్ డాట్ కం (Better.com) సి‌ఈ‌ఓ విశాల్ గార్గ్ ఒక్క జూమ్ కాల్‌(zoom call)లో 900 మంది ఉద్యోగులను వివాదాస్పదంగా తొలగించిన కారణంగా అతను ఆ ప్రభావాన్ని ఎదుర్కొంటారా లేదా  మరింత దిగజారిపోతాడా.. ఇది ఆనంద్ మహీంద్రా(anand mahindra)కు ఉన్న ప్రశ్న. 

 నిన్న షేర్ చేసిన ఒక ట్వీట్‌లో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్  తన 8.5 మిలియన్ల ట్విట్టర్ ఫాలోవర్లను ఈ విషయంపై  అడిగారు: "ఇలాంటి పొరపాటు తర్వాత ఆ కంపెనీ సి‌ఈ‌ఓ మనుగడ కొనగించగలడు అని మీరు అనుకుంటున్నారా?" అంటూ పోస్ట్ లో వ్రాసారు.  66 ఏళ్ల ఆనంద్ మహీంద్రా అతనికి రెండవ అవకాశం ఇవ్వడం న్యాయమైతే  అది నిజంగా తనకి ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నారు.

Better.com సి‌ఈ‌ఓ విశాల్ గార్గ్ గత వారం జూమ్ కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులని తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కంపెనీలో తొలగింపులను నిర్వహించే తీరుకు క్షమాపణలు కూడా తెలిపాడు.

అయితే లీక్ అయిన వీడియోపై తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్న తర్వాత  కంపెనీ సి‌ఈ‌ఓ మంగళవారం ఒక లేఖలో "నేను ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేసిన విధానం క్లిష్ట పరిస్థితిని మరింత దిగజార్చిందని నేను గ్రహించాను."అని అన్నారు.

 విశాల్ గార్గ్ క్షమాపణ గురించి న్యూయార్క్ టైమ్స్ ట్వీట్‌పై స్పందిస్తూ "రెండో అవకాశం ఇవ్వడం న్యాయమా, కాదా..?" అని ఆనంద్ మహీంద్రా ప్రశ్నించాడు.


 నాకు ఆసక్తిగా ఉంది.. ఇలాంటి పొరపాటు జరిగిన తర్వాత ఒక కంపెనీ సి‌ఈ‌ఓ మనుగడ సాగించగలడని మీరు అనుకుంటున్నారా.. ? రెండో అవకాశం ఇవ్వడం న్యాయమా కాదా...?

వివాదాస్పదమైన ఉద్యోగుల తొలగింపు పై ఆనంద్ మహీంద్రా  పోస్ట్ కి ట్విట్టర్ ఫాలోవర్ల  అభిప్రాయాన్ని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో విభజించింది.

"ఖచ్చితంగా కాదు. సి‌ఈ‌ఓకి ఒకరి మనోభావాలను అర్ధంచేసుకోవడం, వ్యక్తపర్చడం  అలాగే  ఈ‌క్యూ లేకపోవడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది" అని ఒక యూజర్ పోస్ట్ చేశాడు.

మీ ప్రశ్న “ఒక సి‌ఈ‌ఓ దీని తరువాత మనిగడా చేయగలదా? ".  దానికి సమాధానం ఖచ్చితంగా కాదు. సి‌ఈ‌ఓకి   అర్ధంచేసుకోవడం, వ్యక్తపర్చడం అలాగే  ఈ‌క్యూ లేకపోవడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఎవరిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నాడో తెలియదు. ఈ రోజుల్లో ప్రజలు పనిచేసే కంపెనీల పట్ల ఫ్రైడ్ తక్కువగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.
 


ఎవరైనా అతనికి రెండో అవకాశం ఇస్తారా అని కాదు సార్! లీడర్ గా ఉండాల్సిన సానుభూతి అతనికి ఉందా లేదా అనే దాని గురించి!

 అతను అగౌరవపరిచిన మొత్తం 900 మందికి అతను రెండవ అవకాశం ఇవ్వగలిగితే.. అప్పుడు ఖచ్చితంగా రెండవ అవకాశంకి అర్హుడు" అని ఒక ట్విట్టర్ యూజర్ తెలిపారు.

 ఒక నివేదిక ప్రకారం  ఉద్యోగుల తొలగింపు  తర్వాత Better.comలో ముగ్గురు ఉన్నత అధికారులు రాజీనామా కూడా చేశారు. కంపెనీ మార్కెటింగ్ హెడ్, పబ్లిక్ రిలేషన్స్ హెడ్ అండ్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ తమ రాజీనామాలను అందజేసినట్లు నివేదించింది అలాగే మరింతకొంత  మంది కూడా రాజీనామాలను అనుసరించే అవకాశం ఉందని తెలిపింది. 
 

Latest Videos

click me!