అయితే షారూఖ్ ఖాన్ సంపాదన, ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడో తెలుసా.. షారుక్ ఖాన్ గ్యారేజీలో ఉన్న కాస్ట్లీ లగ్జరీ కార్ల ధర ఎంతో తెలుసా..? వీటి ధర తెలిస్తే మీరు నమ్మలేరు.. ఆశ్చరపోతున్నరా అయితే ఒకసారి ఆ కార్ల ధర ఎంతో చూడండి..
బెంట్లే కాంటినెంటల్ జీటీఇంటెర్నేషనల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న లగ్జరీ సెడాన్ కార్లలలో ఇది కూడా ఒకటి. 4.0లీటర్ల వీ8 ట్విన్ టర్బో ఇంజన్, 500 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. షారూఖ్ ఖాన్ షూటింగ్‌కి వెళ్తున్నప్పుడు ఎక్కువగా ఈ కారునే వినియోగిస్తుంటాడు. ఈ కారు ధర రూ: 3.29 కోట్ల నుండి రూ.4.43 మధ్య ఉంటుంది.
బుగాటీ వేరాన్‌ప్రపంచంలో అత్యంత వేగంగా దూసుకెళ్లే కార్లలో బుగాటీ వేరాన్ ఒకటి. ఈ కారు డిజైన్, తయారీ జర్మనీ అవుతుంది. అయితే షారుక్ ఖాన్ అభిరుచికి అనుగుణంగా కొన్ని మార్పులు కూడా ఈ కారులో చేయించుకున్నాడు. ఇలాంటి కారు ఇండియా సెలబ్రిటీలలో షారూఖ్ ఒక్కడి దగ్గరే ఉంది. ఈ కారు ధర రూ: 12కోట్ల 50 వేల నుండి మొదలవుతుంది.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపెఇంటెర్నేషనల్ స్టార్ల నుండి హావుడ్ సెలెబ్రిటీల వరకు ఈ కారుని ఇష్టపడని వారు లేరు. కిమ్ కార్దాషియన్, డేవిడ్ బెక్‌హాం, జెన్నిఫర్ లోపెజ్‌లాంటి అంతర్జాతీయ స్టార్లు కూడా ఇష్టపడ్డ కారు ఇది. ఈ బ్రిటీష్ లగ్జరీ కారును 6 కోట్లు ఖర్చు చేసి షారుక్ ఖాన్ కొన్నాడు. అంతేకాదు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి దగ్గర కూడా ఈ కారు ఉంది.
బీఎండబ్ల్యూ ఐ8షారూఖ్ ఖాన్ తన భార్య గౌరీ ఖాన్ పుట్టినరోజు బహుమతిగా ఈ కారును ఇచ్చాడు. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కారు. సచిన్ టెండుల్కర్, శిల్పాశెట్టి సైతం ఈ కారును వినియోగిస్తున్నారు. ఈ కారు ధర రూ. 2.14 కోట్లు
బీఎండబ్ల్యూ 7 సిరీస్ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన మరో అద్భుతమైన సూపర్ ఫాస్ట్ కార్ ఇది. ముంబయిలో ఉన్నప్పుడు షారూఖ్ ఖాన్ ఎక్కువగా ఈ కారులోనే ప్రయాణిస్తుంటాడు. ఈ కారు శక్తిమంతమైన 4.4 లీటర్ల వీ8 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. కేవలం ఐదు సెకన్లలోనే వంద కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. ఈ కారు ధర రూ.1.30 కోట్లు
బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ఈ కారు ధర రూ.2.38 లక్షలు
మిత్సుబిషి పాజెరోఈ కారు ధర రూ. 35 లక్షలు
ఆడి ఏ6ఈ కారు ధర రూ.1. కోటి
టొయోటా లాండ్ క్రుయిసర్ ప్రాడోఈ కారు ధర రూ.92.60 లక్షలు
షారుక్ ఖాన్ లగ్జరీ వ్యాన్ ఈ లగ్జరీ వ్యాన్ పొడవు 14 మీటర్లు. దీనిని షారుక్ ఖాన్ నమ్మకస్తూడైన ఆటోమోబైల్ డిజైనర్ దిలీప్ చాబారియ డిజైన్ చేశారు. ఈ వ్యాన్ లోని స్పెషాలిటీ ఏంటంటే ఫ్యూచర్ టెక్నాలజి. ఇందులో హై ఎండ్ ఆడియో-వీడియొ సిస్టం, డ్రైవరు కాబిన్, మాస్టర్ బెడ్ రూమ్, రెస్ట్ రూమ్, మేకప్ సెక్షన్, వ్యాన్ లోపల పై భాగంలో అరుదైన ఎల్‌ఈడి లైట్స్ గ్లాస్ ఫ్లోర్ తో పాటు ఇంకా మరెన్నో అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి.