మైలేజ్ కా బాస్ బైక్ ఇదే.. 1 లీటర్‌కు 73 కి.మీ.. సామాన్యుడి డ్రీమ్ బైక్...

First Published | Jun 5, 2024, 6:58 PM IST

భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కొత్త జనరేషన్ హీరో స్ప్లెండర్ XTEC 2.0ని లాంచ్ చేసింది. దీని ధర, ప్రత్యేకమైన ఫీచర్స్  మిమ్మల్ని మరింతగా ఆకట్టుకుంటుంది... అయితే ఈ ఫీచర్స్ ఏంటో తెలుసా.. 
 

ఈ బైక్ మైలేజ్ 73 kmpl. ప్రపంచంలోనే అతిపెద్ద బైక్స్  అండ్ స్కూటర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ బైక్‌లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. దీనిని Splendor + XTEC 2.0 పేరుతో లాంచ్ చేయబడింది.
 

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్ప్లెండర్ బైక్  30వ వార్షికోత్సవాన్ని ఈ లాంచ్ సూచిస్తుంది. ఈ కొత్త మోడల్ ఎన్నో  లేటెస్ట్ టెక్నాలజీలతో అమర్చబడింది. ఈ బైక్ 100 cc ఇంజిన్, 7.9 BHP పవర్, 73 kmpl మైలేజీ, 5 సంవత్సరాలు లేదా 70,000 km వారంటీతో వస్తుంది.
 

Latest Videos


కొత్త జనరేషన్ స్ప్లెండర్ ప్లస్ 100cc i3s ఇంజన్‌తో 7.9 bhp శక్తిని, 8.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ ఇంజన్ అద్భుతమైన మైలేజీని అందిస్తుందని, 6000 కి.మీ వరకు సర్వీస్ అవసరం లేదని కంపెనీ పేర్కొంది.  
 

ఈ బైక్ పై 5 సంవత్సరాలు లేదా 70,000 కిమీ వారంటీ ఉంటుంది. భారతీయులకు ఈ బైక్‌ అంటే చాలా ఇష్టం. ఈ కొత్త బైక్ మైలేజీని పరిశీలిస్తే 73 kmpl అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. ఈ కొత్త అప్‌డేట్ స్ప్లెండర్+ XTEC 2.0ని సిటీ  అండ్  గ్రామీణ ప్రయాణికులకు బెస్ట్  అప్షన్ గా చేస్తుంది.
 

Splendor+ XTEC 2.0 కొత్త టెక్నాలజీ, పూర్తిగా డిజిటల్ స్పీడోమీటర్‌ పొందుతుంది. కాలింగ్, SMS అలర్ట్స్  కోసం బ్లూటూత్ కనెక్టివిటీ కూడా  ఉంది.  బైక్ సేఫ్టీ కోసం hazard లైట్లు, సైడ్ ఇంజన్ కటాఫ్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ Splendor+ XTEC 2.0 బైక్ ధర చూస్తే భారతీయ మార్కెట్లో దీని ధర రూ.82,911 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

click me!