హీరో నాగ చైతన్య కొత్త కారు.. అక్షరాలా దీని ధర ఎంతో తెలుసా..?

First Published | May 28, 2024, 5:44 PM IST

హీరో నాగ చైతన్య ఖరీదైన కార్ల కలెక్షన్‌కి మరో కార్ వచ్చి చేరింది. తాజాగా సిల్వర్ కలర్ పోర్షే 911 జిటి3 కారును కొన్నారు. ఈ కారు ధర, నాగ చైతన్య దగ్గర ఉన్న ఇతర ఖరీదైన కార్ల గురించి మీకోసం...

హీరో నాగ చైతన్య సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి వార్తల్లో నిలుస్తుంటారు. దీనికి తోడు నాగ చైతన్య కార్ల కలెక్షన్ విషయంలో కూడా భారీ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు అతని ఖరీదైన కార్ల వరుసలోకి మరో కొత్తది వచ్చి చేరింది.
 

నాగ చైతన్య ఖరీదైన Porsche 911 GT3 సూపర్ కారును కొన్నారు. దీని ధర రూ.3.51 కోట్లు. అత్యంత ఆకర్షణీయమైన ఈ కారులో 2 సీట్లు మాత్రమే ఉంటాయి.
 


ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సరిపోయే ఖరీదైన పోర్షే కారు గురించి నాగ చైతన్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ కొత్త కారు కొన్నందుకు తన సంతోషాన్ని కూడా పంచుకున్నారు.
 

చైతు కొనుగోలు చేసిన పోర్షేలో 3996 సిసి, 6 సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ కారు టాప్ స్పీడ్  గంటకు 296 కి.మీ. కానీ ఈ కారు ఒక లీటర్ పెట్రోల్‌కు కేవలం 7.4 కి.మీ మైలేజీ మాత్రమే ఇస్తుంది.

ఈ కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లతో సహా హై   సేఫ్టీ ఫీచర్స్  ఉన్నాయి. ఈ కారు 518 బిహెచ్‌పి పవర్, 465 ఎన్ఎమ్ టార్క్ ఉంది. కాబట్టి దీని  పర్ఫార్మెన్స్ అద్భుతం.
 

37 ఏళ్ల హీరో నాగ చైతన్య మొత్తం ఆస్తుల విలువ రూ.154 కోట్లు. అతనికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గొప్ప రాజ భవనం కూడా  ఉంది.

నాగ చైతన్య దగ్గర రూ.1.75 కోట్ల విలువైన ఫెరారీ ఎఫ్430 కారు, రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కూడా ఉంది.
 

13 లక్షల రూపాయల ధర ఉన్న BWM బైక్, ట్రయంఫ్ థ్రక్స్టన్ R బైక్ పై కూడా చాలాసార్లు కనిపించారు. ఇవి కాకుండా మరికొన్ని ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి.
 

Latest Videos

click me!