సిటీ రైడ్స్ కోసం క్లచ్ లేని బైక్ ! హోండా నుండి ఈ టెక్నాలజీ గేమ్ ఛేంజర్ అవుతుందా.. !

First Published Oct 28, 2023, 6:29 PM IST

 బైక్ నడుపుతున్నప్పుడు ఎక్కువ ఒత్తిడి చేతులు ఇంకా కాళ్ళపై ఉంటుంది. దీనికి ముఖ్య కారణం క్లచ్ అండ్ గేర్. సిటీ  ట్రాఫిక్‌లో బైక్‌ నడుపుతున్నప్పుడు, గేర్‌లు మార్చేటప్పుడు పదేపదే క్లచ్‌ నొక్కడంతో  అలసిపోతుంటం. అయితే ఈ పెద్ద సమస్యకు పరిష్కారం రానుంది. 

 జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా చాలా ప్రత్యేకమైన ఈ-క్లచ్ టెక్నాలజీపై పని చేస్తోంది. ఇందుకు ఆటోమేటెడ్ క్లచ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. ఇంకా బైక్ క్లచ్-లెస్ గేర్ షిఫ్టింగ్‌ ఇస్తుంది. అంటే బైక్ నడిపే పద్ధతి పూర్తిగా మారిపోతుంది. 

bike

ఈ టెక్నాలజీ కొన్ని హ్యుందాయ్ అండ్ కియా కార్లలో ఉన్న IMT (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్‌ లాగా ఉంటుంది. ఈ IMT సిస్టమ్‌లో క్లచ్ లేదు కానీ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఉంటుంది. క్లచ్‌ని యాక్టివేట్ చేయడానికి లేదా డీయాక్టివేట్ చేయడానికి గేర్ లివర్‌పై ఉన్న 'ఇంటెలిజెంట్ ఇంటెన్సిటీ సెన్సార్'ని ఉపయోగిస్తుంది. హోండా ఈ టెక్నాలజీలో క్లచ్‌ను చేర్చినప్పటికీ, కేవలం  డిస్  ప్లే  కోసం మాత్రమే అందించబడుతుంది. 
 

మల్టీ-గేర్  ట్రాన్స్‌మిషన్ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమేటిక్ క్లచ్ కంట్రోల్ సిస్టమ్ అని ఇంకా  మల్టీ-గేర్  ట్రాన్స్‌మిషన్‌లో ఉపయోగించబడుతుందని హోండా పేర్కొంది. క్లచ్‌ని ఉపయోగించకుండా బైక్ రైడింగ్‌ను ఈజీ చేయడం ఈ టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి  ముఖ్య లక్ష్యం. ప్రతి రోజు రాకపోకలకు  బైకుని ఉపయోగించే వారికి ఈ టెక్నాలజీ వరంగా మారనుంది. 
 

bike

హోండా ఇ-క్లచ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది, అయితే ఆటోమేటిక్ క్లచ్ కంట్రోల్ సిస్టమ్ అన్ని పరిస్థితులలో సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇ-క్లచ్ రైడర్‌కు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఇంకా  మాన్యువల్ క్లచ్ ఆపరేషన్ కంటే గేర్ షిఫ్టింగ్‌ను సులభతరం చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇ-క్లచ్ సిస్టమ్‌లో ఏదైనా బైక్  లాగా ఒక మాన్యువల్ క్లచ్ లివర్ మాత్రమే  ఉంటుంది, అయితే మెకానికల్ గా నిర్వహించబడుతుంది. దీన్ని మాన్యువల్‌గా కూడా ఆపరేట్ చేయవచ్చు. విశేషమేమిటంటే, డ్రైవర్ గేర్ మార్చడానికి మళ్లీ మళ్లీ క్లచ్ నొక్కాల్సిన అవసరం లేదు.

Latest Videos

click me!