500 కి.మీ మైలేజీ, జపాన్‌లో మారుతీ మ్యాజిక్..! నెక్స్ట్ టార్గెట్ ఇండియా..

Published : Oct 28, 2023, 12:28 PM IST

సుజుకి మోటార్ కార్పొరేషన్ కొనసాగుతున్న జపాన్ మొబిలిటీ షో 2023లో అప్ డేటెడ్  EVX ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది . కంపెనీ కొత్త జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను కూడా ప్రదర్శించింది. 

PREV
16
 500 కి.మీ మైలేజీ, జపాన్‌లో మారుతీ మ్యాజిక్..! నెక్స్ట్ టార్గెట్ ఇండియా..

ఇండియన్  కార్ లవర్స్  కొత్త స్విఫ్ట్ అండ్  మారుతి EVX ఎలక్ట్రిక్ SUV లాంచ్ కోసం ఎదురుచూస్తున్నారు, వీటిని   2024 అండ్ 2025 ప్రారంభంలో లాంచ్ చేయనున్నారు. భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఊపందుకుంటున్నందున మారుతి eVX పెరుగుతున్న ఎలక్ట్రిక్ SUV విభాగంలో గట్టి  పోటీదారుగా ఉంటుందని కంపెనీ హామీ ఇచ్చింది.

26
EVX launch

EVX ఎలక్ట్రిక్ SUV గురించి అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, ఫైనల్  వెర్షన్ ఎలక్ట్రిక్ మోటార్ అండ్ 60kWh బ్యాటరీ ప్యాక్‌తో  ఉంటుందని భావిస్తున్నారు. కొత్త మారుతి eVX ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌ను పొందుతుంది. ఈ కార్  ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కి.మీ ప్రయాణిస్తుంది. 
 

36

సైజ్  పరంగా చూస్తే రాబోయే మారుతి ఎలక్ట్రిక్ SUV పొడవు 4,300 mm, వెడల్పు 1,800 mm, ఎత్తు 1,600 mm, వీల్‌బేస్‌లో 2,700 mm. దీని అర్ధం ఈ మోడల్ 4,300mm పొడవుతో హ్యుందాయ్ క్రెటా లాగే వెడల్పుగా ఉంటుంది.
 

46
eVX

టయోటా 40PL గ్లోబల్ ఆర్కిటెక్చర్ నుండి తీసుకోబడిన 27PL ప్లాట్‌ఫారమ్‌పై ఈ eVX నిర్మించబడింది. కార్ బయటి   డిజైన్లో  కొత్త ట్రై-యారో LED DRLలు, స్లీక్ హెడ్‌ల్యాంప్‌లు, అప్‌గ్రేడ్ ORVMలు, స్పోర్టీ బంపర్ ఉన్నాయి. దీని సైడ్ ప్రొఫైల్ వీల్ ఆర్చ్‌లు, అల్లాయ్ వీల్స్ ఇంకా ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్‌తో  డెవలప్ చేసారు. వెనుక వైపు ప్రత్యేకమైన 3-పీస్ లైటింగ్ ప్యాట్రన్,  స్కిడ్ ప్లేట్ అండ్  కొత్త DRL లైట్ సిగ్నేచర్‌తో కనెక్ట్ చేయబడిన LED టెయిల్‌ల్యాంప్‌లను చూడవచ్చు.
 

56

క్యాబిన్ లోపల, మినిమలిస్టిక్ విధానం స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త Suzuki eVX డాష్‌బోర్డ్‌లో ఫిజికల్ బటన్‌లను అందిస్తుంది. మరొక ముఖ్యమైన ఫీచర్  డ్యూయల్-స్క్రీన్ సెటప్, ఒక స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌కు  మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ SUVకి రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్,  AC వెంట్లు, సెంటర్ కన్సోల్‌లో రోటరీ డయల్ నాబ్, యాంబియంట్ లైటింగ్,  డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీ కూడా ఉన్నాయి.
 

66

మారుతి సుజుకి EVX భారతదేశంలోని MG ZS EV, రాబోయే హ్యుందాయ్ క్రెటా EVతో నేరుగా పోటీపడుతుంది. ఈ ఎలక్ట్రిక్ SUV  ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర సుమారు రూ. 25 లక్షలు.

click me!

Recommended Stories