Honda Car Offers : కొత్త కారు కొనాలనుకునేవారికి హోండా సంస్థ బంపరాఫర్ ఇస్తోంది… నవంబర్ నెలలో కొన్ని కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు ఉంది? ఈ ఆఫర్లు ఎప్పటి వరకు ఉంటాయి? తదితర వివరాలు తెలుసుకుందాం.
కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా సరికొత్త ఆఫర్లతో ఆకట్టుకుంటోంది. పండుగ సీజన్ ముగిసినా కస్టమర్లను ఆకట్టుకునేందుకు క్యాష్ డిస్కౌంట్లతో పాటు పలు ప్రయోజనాలను అందిస్తోంది.. దీంతో కొన్ని మోడల్స్ చాలా తగ్గింపు ధరకే వస్తున్నాయి. మరీముఖ్యంగా పాపులర్ మోడల్ హోండా సిటీ కారుపై గరిష్ఠంగా రూ.1.86 లక్షల వరకు ఆఫర్ లభిస్తోంది. అలాగే అమెజ్ కారు పాత, కొత్త జనరేషన్ మోడల్స్‌పై కూడా విడివిడిగా డిస్కౌంట్లు ఉన్నాయి.
25
సిటీ కారుపై రూ.1.86 లక్షల వరకు ఆఫర్
హోండా పాపులర్ సెడాన్ సిటీ కారుపై ఈ నెలలో అత్యధిక డిస్కౌంట్ ఉంది. ఈ కారు కొనే కస్టమర్లు రూ.1.86 లక్షల వరకు లాభపడొచ్చు. విశాలమైన ఇంటీరియర్, సౌకర్యవంతమైన ప్రయాణం, సేఫ్టీ ఫీచర్ల కోసం కస్టమర్లు ఈ కారును ఇష్టపడతారు. ప్రీమియం సెడాన్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. అయితే చెప్పిన గరిష్ఠ ఆఫర్ అన్ని వేరియంట్లకూ వర్తించకపోవచ్చు.
35
అమేజ్ కారుపై కూడా భారీ డిస్కౌంట్
హోండా కాంపాక్ట్ సెడాన్ అమేజ్ థర్డ్ జనరేషన్ మోడల్‌పై రూ.66,800 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే పాత సెకండ్ జనరేషన్ అమేజ్ కారు కొనాలనుకునే వారికి రూ.57,600 వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. తక్కువ బడ్జెట్‌లో ఫ్యామిలీ కారు వెతికే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్స్. కానీ మోడల్ ఇయర్, స్టాక్, డీలర్‌షిప్‌ను బట్టి ఆఫర్ మొత్తం మారుతుంది.
హోండా ఎలివేట్, జెడ్.ఆర్-వి మోడల్స్‌పై ఈ నెలలో పెద్దగా జనరల్ ఆఫర్లు లేవు. అయినప్పటికీ కొన్ని కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు కార్పొరేట్ డిస్కౌంట్లు దక్కే ఛాన్స్ ఉంది. ఈ ఆఫర్లు కంపెనీలు, కస్టమర్ల అర్హతను బట్టి మారుతాయి. మీ కంపెనీ పేరు కార్పొరేట్ ఆఫర్ల లిస్టులో ఉందో లేదో డీలర్‌షిప్‌లో అడిగి తెలుసుకోవచ్చు.
55
నవంబర్ 30 వరకే ఆఫర్లు
హోండా కంపెనీ ఈ నవంబర్ ఆఫర్లు 2026 నవంబర్ 30 వరకే వాలిడిటీలో ఉంటాయి. అయితే సిటీ, డీలర్‌షిప్, కారు వేరియంట్‌ను బట్టి ఈ ఆఫర్లు మారతాయి. ఇక్కడ చెప్పినవి గరిష్ఠ ఆఫర్లు మాత్రమే. బుకింగ్ చేయడానికి ముందు దగ్గర్లోని హోండా డీలర్‌షిప్‌కు వెళ్లి క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, ఇతర ప్రయోజనాల వివరాలను కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది.