2024లో బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లు ఇవే.. ధర కూడా చాలా తక్కువ..!

First Published | Jan 13, 2024, 3:21 PM IST

రోజురోజుకి ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల ఆదరణ పెరుగుతోంది. మరోవైపు కొత్తకొత్త కంపెనీలు కూడా EVలను లాంచ్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో బ్యాటరీ రేంజ్, స్పెసిఫికేషన్‌లు ఇంకా  లేటెస్ట్ ధరతో భారతదేశంలోని కొన్ని అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్స్  లిస్ట్ గురియించి మీకోసం...
 

బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్. కన్సోల్ లో వాహనం స్పీడ్, బ్యాటరీ పరిధి మొదలైనవి చూడవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం  ప్రత్యేకత ఏమిటంటే మీరు బైక్ అండ్  బ్యాటరీని కొనుగోలు చేయవచ్చు లేదా వాహనాన్ని కొనుగోలు చేసి బ్యాటరీని రెంట్  తీసుకోవచ్చు.  కాబట్టి, దీని ప్రారంభ ధర రూ. 60,000 నుండి ఉంటుంది. 
 

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ఎలక్ట్రిక్ మోటార్‌తో నడిచే స్కూటర్-డిజైన్‌తో వస్తుంది. ఈ స్కూటర్ పట్టణం అంతటా చిన్న రైడ్‌లకు అనుకూలంగా ఉంటుంది. దీనికి ఆచరణాత్మక అంశాలు కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు రకాలుగా వస్తాయి: సింగిల్ అండ్  డ్యూయల్ బ్యాటరీ. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ధర రూ. 67,000 నుండి మొదలవుతుంది.
 


ఒకినావా రిడ్జ్ ప్లస్

ఒకినావా రిడ్జ్ ప్లస్ అధిక సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటార్ అండ్ బ్యాటరీతో వస్తుంది. విశాలమైన సీటు, లాంగ్ లెగ్ రూమ్ కారణంగా  సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే  ఉత్తమ స్పీడ్  అందించకపోవచ్చు, కానీ రిటైల్ ధర కోసం ఉత్తమ బ్యాటరీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ. 70,000 నుండి ఉంటుంది.

ఆంపియర్ మాగ్నస్‌

ఆంపియర్ మాగ్నస్‌లో పొడవైన ఫ్రంట్ ఆప్రాన్ అండ్  ఫ్రంట్ బౌల్ హెడ్‌లైట్లు అండ్  అద్దాలు ఉన్నాయి. దీనికి  ముందు వైపున టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్  వెనుక వైపున మోనో-షాక్ సస్పెన్షన్‌  ఉంది. ఒకే సీటు వెడల్పుగా అండ్ ఇద్దరికి సౌకర్యంగా ఉంటుంది. హబ్ మోటార్ గొప్పగా పనిచేస్తుంది అంతేకాదు మంచి బ్యాటరీ పరిధిని అందిస్తుంది. దీని ధర రూ. 77,000 నుండి మొదలవుతుంది.
 

 Ola S1 అండ్ S1 ప్రో

Ola S1 ఒక స్టైలిష్ అండ్  ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ప్రధాన లక్ష్యం స్థోమత. సెడాన్ వెడల్పు ఇంకా  ఖరీదైన సీట్లతో సౌకర్యవంతంగా ఉంటుంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో  ఒకటి. కంపెనీ ఈ మోడల్‌ను మూడు వేరియంట్‌లలో అందిస్తుంది: S1 ఎయిర్, S1 ఇంకా S1 ప్రో.  170 కిమీల వరకు అద్భుతమైన బ్యాటరీ పరిధిని అందిస్తుంది. దీని ధర రూ. 85,000 నుండి ఉంటుంది.

Latest Videos

click me!