Safe Cars Under 5 Lakh: మైలేజ్, సేఫ్టీ, CNG ఆప్షన్ తో రూ.5 లక్షల్లో ఇంత మంచి కారు దొరుకుతుందా?

Published : Jul 04, 2026, 03:54 PM IST

Safe Cars Under 5 Lakh: కారు కొనాలంటే చాలా చెక్ చేసుకోవాలి. బడ్జెట్ చూసుకోవాలి. అయితే మంచి మైలేజ్, సేఫ్టీ, CNG ఆప్షన్‌, రూ.5 లక్షల్లోపే కారు కొనాలని ప్లాన్ చేస్తే ఈ కార్లపై ఓ లుక్కేయండి. ధర, ఫీచర్ల పరంగా బెస్ట్ అనిపించే ఇక్కడున్న 4 మోడళ్లు చూసేయండి.

PREV
15
రూ.5 లక్షల లోపు కార్లు

కారు కొనాలంటే చాలా చెక్ చేసుకోవాలి. బడ్జెట్ చూసుకోవాలి. అయితే మంచి మైలేజ్, సేఫ్టీ, CNG ఆప్షన్‌, రూ.5 లక్షల్లోపే కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో మొదటిసారి కారు కొనాలనుకునే వాళ్లు ప్రధానంగా రెండు విషయాలు చూస్తారు. ఒకటి తక్కువ ధర, రెండోది ఎక్కువ మైలేజ్. వీటికి తోడు మంచి సేఫ్టీ ఫీచర్లు, సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. అలాంటి వారి కోసమే రూ.5 లక్షల లోపు ధరలో కొన్ని అద్భుతమైన హ్యాచ్‌బ్యాక్, చిన్న SUV కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, ఆల్టో కె10, రెనాల్ట్ క్విడ్, టాటా టియాగో... ఈ నాలుగు మోడళ్లు ధర, ఫీచర్లు, మెయింటెనెన్స్‌లో బెస్ట్ ఆప్షన్స్‌గా నిలుస్తున్నాయి.

25
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

ఈ లిస్ట్ లో అన్నిటికంటే తక్కువ ధరలో దొరికే కారు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో. దీని ప్రారంభ ధర రూ.3.49 లక్షలు. దీని ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ లీటర్‌కు 25.30 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. చిన్న ఎస్‌యూవీ లాంటి లుక్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు సిటీ ప్రయాణాలకు బాగా సరిపోతాయి. సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉండటంతో పెట్రోల్ ఖర్చును తగ్గించుకోవచ్చు.

35
మారుతి ఆల్టో కె10
తర్వాతి స్థానంలో మారుతి ఆల్టో కె10 ఉంది. దీని ప్రారంభ ధర రూ.3.69 లక్షలు. 998 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మోడల్‌లో లీటర్‌కు 24.90 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ, 7-అంగుళాల టచ్‌స్క్రీన్, సీఎన్‌జీ ఆప్షన్ వంటివి దీని ప్రధాన బలాలు. ఇక రెనాల్ట్ క్విడ్ ప్రారంభ ధర రూ.4.29 లక్షలు. డేటైమ్ ఎల్ఈడీ లైట్లు, రూఫ్ రెయిల్స్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్, రియర్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ఇది ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
45
టాటా టియాగో

సేఫ్టీ ముఖ్యమనుకుంటే టాటా టియాగో బెస్ట్ ఛాయిస్. దీని ప్రారంభ ధర రూ.4.70 లక్షలు. ఈ కారు గ్లోబల్ ఎన్‌క్యాప్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇందులో 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్, సీఎన్‌జీ ఆప్షన్, టచ్‌స్క్రీన్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

55
బడ్జెట్ కార్లు

తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలనుకునే వాళ్లు కేవలం ధర మాత్రమే కాకుండా మైలేజ్, నిర్వహణ ఖర్చు, లాంగ్ టర్మ్ వాడకాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రోజువారీ సిటీ ప్రయాణాలకైనా, ఫ్యామిలీ అవసరాలకైనా, లేదా మొదటి కారుగానైనా... ఈ నాలుగు మోడళ్లు మీ డబ్బుకు పూర్తి విలువనిచ్చే బెస్ట్ ఆప్షన్స్‌.

Read more Photos on
click me!

Recommended Stories