కే‌టి‌ఎం డ్యూక్ కి పోటీగా బెనెల్లీ కొత్త 250సి‌సి బైక్.. దీని స్పెషల్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు తెలుసుకోండి

First Published | Dec 14, 2021, 1:00 PM IST

 ఇటలీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బెనెల్లీ(Benelli) యూరోపియన్ మార్కెట్‌ కోసం 2022 లియోన్సినో 250 (Leoncino 250) మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్వార్టర్-లీటర్ బైక్  తాజా వెర్షన్ చాలా కాస్మెటిక్ అప్‌డేట్‌లతో వస్తోంది.

ఇంజన్ అండ్ పవర్
లియోన్‌సినో 250 పాత మోడల్ లాగానే 250cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 9,250 rpm వద్ద 25.4 bhp, 8,000 rpm వద్ద 21 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్  ఇచ్చారు.

లుక్ అండ్ స్టైల్
2022 బెనెల్లీ లియోన్సినో 250 (2022 Benelli  Leoncino 250) కొత్త LED హెడ్‌ల్యాంప్‌ను పొందింది, అలాగే బైక్‌కు చాలా ఆధునికమైన ఫ్రంట్ లుక్‌ని అందించారు. అంతేకాకుండా ఈ బైక్ కి కొత్త రూపాన్ని ఇవ్వడానికి కొత్త గ్రాఫిక్స్ ఇచ్చారు. ఇవి కాకుండా బైక్‌లో పెద్దగా  ఇతర మార్పులు చేయలేదు.


ఫీచర్లు
బైక్  ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే ఇందులో ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈ‌డి టర్న్ సిగ్నల్స్, అల్లాయ్ వీల్స్, సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్, సింగిల్-పీస్ సీట్ అండ్ లైసెన్స్ ప్లేట్ హోల్డర్ సరిపోయే వెనుక టైర్ హగ్గర్ ఉన్నాయి.

సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్
లియోన్సినో 250 సస్పెన్షన్ కోసం 41 mm USD ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనో-షాక్ ఇచ్చారు. బ్రేకింగ్ కోసం 280 mm ఫ్రంట్ రోటర్ అండ్ 240 mm బ్యాక్ రోటర్ పొందుతుంది.

Latest Videos

click me!