పండగకి మీ డ్రీమ్ కార్ బుక్ చేస్తున్నారా.. అయితే దాని డెలివరి వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసుకోండి..

First Published Oct 9, 2021, 4:09 PM IST

ప్రస్తుతం మొత్తం ఆటోమొబైల్ పరిశ్రమ చిప్ షార్టేజ్ సమస్యతో సతమతమవుతోంది. ఈ కారణంగా కార్ల కంపెనీలతో పాటు కస్టమర్‌లు కూడా నష్టపోవాల్సి వస్తుంది. చిప్ కొరత కారణంగా కార్లు ధరలు మాత్రమే కాదు, వెయిటింగ్ పీరియడ్ కూడా పెరుగుతోంది దీని వల్ల వాహనాల అమ్మకాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. 

చిప్ షార్టేజ్ కారణంగా పండుగ సీజన్‌లో కస్టమర్‌లు కొత్త వాహనం కొనుగోలుకు నిరాశ ఎదురవుతుంది. నివేదికల ప్రకారం సుమారు ఐదు లక్షల వాహనాల ఆర్డర్లు డెలివరీ కోసం వేచి ఉన్నాయి. చిప్ షార్టేజ్ కారణంగా ఒక్క మారుతి సుజుకీకి మాత్రమే 2.20 లక్షల ఆర్డర్‌లు ఉన్నాయి. కస్టమర్‌లు కూడా  కార్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు కొత్త కారును బుక్ చేసుకోవాలని ఆలోచిస్తుంటే అక్టోబర్ నెలలో ఏ కార్లపై ఎంత వేటింగ్  సమయం పడుతుందో తెలుసుకోండి.
 

మహీంద్రా థార్
మీరు మహీంద్రా థార్ కొనాలని ఆలోచిస్తే మీరు ఈరోజు బుక్ చేస్తే వచ్చే ఏడాది  డెలివరీ ఉంటుంది. అది కూడా వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో కొన్ని వేరియంట్‌ల బుకింగ్‌ తరువాత 12 నెలల కన్నా ఎక్కువే పడుతుంది. మహీంద్రా థార్ ఇప్పటివరకు 75 వేల బుకింగ్‌లను అందుకుంది.  

మారుతి ఎర్టిగా
దేశవ్యాప్తంగా మారుతి అద్భుతమైన సర్వీస్ నెట్‌వర్క్ కారణంగా ప్రజలు మారుతి కార్లను ఎక్కువగా ఇష్టపడతారు. ఎర్టిగా 7 సీట్ల ఎం‌పి‌వి సెగ్మెంట్‌లో మారుతి అత్యధికంగా అమ్ముడైన కారు. దీని VXi సి‌ఎన్‌జి వేరియంట్‌ కోసం దాదాపు తొమ్మిది నెలల వేటింగ్ పెరియడ్ ఉంది. పెట్రోల్ వేరియంట్లపై కేవలం 4-5 నెలల వేటింగ్ మాత్రమే  ఉంది. ఎర్టిగాలో స్మార్ట్‌ప్లే స్టూడియో, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, లైట్ హైబ్రిడ్ ఇంజిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
 

హ్యుందాయ్ క్రీటా
లాంగ్ వేటింగ్ పిరియడ్, చిప్ కొరత కారణంగా ఎప్పుడూ అమ్ముడుపోయే కాంపాక్ట్ ఎస్‌యూ‌వి నెమ్మదిగా  కస్టమర్‌లలో ఆకర్షణను కోల్పోతోంది. సెప్టెంబర్ అమ్మకాల గణాంకాలలో క్రెటాను ఓడించి సెల్టోస్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. క్రెటాపై 8 నుండి 9 నెలల డెలివరీ వేటింగ్ పీరియడ్ కాలం ఉంది. దీని బేస్ వేరియంట్ E ట్రిమ్‌లో అత్యధికంగా 9 నెలలు వేటింగ్ ఉంది. ఇటీవల కంపెనీ బేస్ వేరియంట్ నుండి కొన్ని ఫీచర్లను తగ్గించింది.

నిస్సాన్ మాగ్నైట్
సబ్ కాంపాక్ట్ ఎస్‌యూ‌వి నిస్సాన్ మాగ్నైట్ గత సంవత్సరం లాంచ్ అయ్యింది. బేస్ XE అండ్ XL వేరియంట్‌లపై గరిష్టంగా 9 నెలల వరకు వేటింగ్ సమయం పడుతుంది. టాప్ వేరియంట్ XL CVTలో కోసం కేవలం ఒక నెల మాత్రమే వేటింగ్ ఉంది. కంపెనీ ఇప్పటికే ఉత్పత్తిని పెంచినప్పటికీ దాని వేరియంట్‌లలో వెయిటింగ్ పీరియడ్ 8 నెలల వరకు చేరుకుంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవ్ మోడ్ వంటి వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూ‌వి700
ఈ లిస్ట్ లో  మహీంద్రా ఎక్స్‌యూ‌వి700 లేటెస్ట్ ఎంట్రీ. అక్టోబర్ 7న బుకింగ్‌లు ప్రారంభించిన వెంటనే కంపెనీ ఒక గంటలోపు ఎక్స్‌యూ‌వి700 25 వేలకు పైగా బుకింగ్‌లను పొందిందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు బుకింగులు ఇప్పుడు 50 వేలు దాటింది. అందుకున్న మొత్తం బుకింగ్‌ల  వెయిటింగ్ పీరియడ్ 6 నుండి 7 నెలలను తాకవచ్చని డీలర్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ వేటింగ్ పీరియడ్ చిప్ కొరతపై కూడా ఆధారపడి ఉంటుంది.

టాటా నెక్సాన్
టాటా మోటార్స్ లైనప్‌లో టాటా నెక్సాన్ అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూ‌వి. ఈ కార్ పెట్రోల్, డీజిల్ వేరియంట్ల కోసం వెయిటింగ్ పీరియడ్ ఐదు నెలలకు చేరుకుంది. ఎలక్ట్రిక్ వెర్షన్ వెయిటింగ్ పీరియడ్ 1-3 నెలలు ఉంది.

 టాటా పంచ్
టాటా పంచ్ కూడా ఈ జాబితాలో కొత్త ఎంట్రీ. కొన్ని రోజుల క్రితం టాటా మోటార్స్ పంచ్ ప్రవేశపెట్టింది. దీని బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. టాటా కొత్త మైక్రో ఎస్‌యూవీ ధరలను కంపెనీ అక్టోబర్ 20న వెల్లడించనుంది. పంచ్ వెయిటింగ్ పీరియడ్ 3-4 నెలల వరకు ఉందని డీలర్లు అంటున్నారు.

కియా సెల్టోస్
ఈ రోజుల్లో ప్రజలు కియా సెల్టోస్‌ని చాలా ఇష్టపడుతున్నారు, సెప్టెంబర్ అమ్మకాల గణాంకాలలో సెల్టోస్ అత్యధికంగా అమ్ముడైన మిడిల్ క్లాస్ ఎస్‌యూ‌వి గా మారింది. సెల్టోస్ కంపెనీ 2019 లో ప్రారంభించారు, అప్పటి నుండి కంపెనీ గరిష్ట సంఖ్యలో యూనిట్లను విక్రయించింది.  సెల్టోస్ వేరియంట్‌లు క్రెటా కంటే చౌకగా ఉంటాయి దీని డిజైన్ ఫ్యూచర్ గా ఉంటుంది, ఈ కారణంగా ప్రజలు కూడా దీన్ని ఇష్టపడతారు. సెల్టోస్ కొన్ని వేరియంట్లపై 3-4 నెలల వేటింగ్ ఉంది.

కియా సొనెట్
కియా మోటార్స్‌లో అత్యధికంగా అమ్ముడైన రెండవ ఎస్‌యూవీ కియా సొనెట్. సబ్ కాంపాక్ట్ విభాగంలో ప్రజలు దీన్ని చాలా ఇష్టపడతారు. ఇప్పుడు  దీని కొన్ని వేరియంట్ల వెయిటింగ్ పీరియడ్ ఐదు నెలల వరకు చేరుకుంది.  

రెనాల్ట్ కిగర్
రెనాల్ట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కిగర్ను లాంచ్ చేసింది. అయితే  గతంలో నిస్సాన్ మాగ్నైట్ కంటే చౌకగా ఉండేది, కానీ ఇప్పుడు దాని ధర మారింది. వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫయర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో,  ఆపిల్ కార్‌ప్లే వంటి ఎన్నో ఆధునిక ఫీచర్లు కిగర్ లో అందించారు. రెనాల్ట్ మాగ్నెటైట్‌తో పోలిస్తే ఈ వెయిటింగ్ పీరియడ్ చాలా తక్కువ. కొన్ని నగరాల్లో కిగర్ కోసం వెయిటింగ్ పీరియడ్ నాలుగు నెలల వరకు ఉంది.

click me!