బంపర్ ఆఫర్: పండుగ సీజన్‌లో కారు కొనేవారికి గోల్డెన్ ఛాన్స్... భారీగా తగ్గింపు..

Ashok Kumar   | Asianet News
Published : Oct 07, 2021, 12:24 PM IST

పండుగ సీజన్ ప్రారంభమవుతున్నందున ఆటోమొబైల్  కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ ఆఫర్లతో పాటు క్యాష్ డిస్కౌంట్లను ప్రకటించాయి. దీని ద్వారా ఆటోమోబైల్ కంపెనీలు  అమ్మకాలను పెంచుకోవాలని భావిస్తున్నాయి. సెమీకండక్టర్ (చిప్), ఇతర ఎలక్ట్రానిక్ భాగాల కొరత కారణంగా వాహనాల అమ్మకాలు కూడా సెప్టెంబర్‌లో క్షీణించాయి.

PREV
15
బంపర్ ఆఫర్: పండుగ సీజన్‌లో కారు కొనేవారికి గోల్డెన్ ఛాన్స్... భారీగా తగ్గింపు..

ఈ కాలంలో అత్యధిక మార్కెట్ వాటా కలిగిన మారుతి కంపెనీ అమ్మకాల్లో 46.16 శాతం క్షీణతను చూసింది, హ్యుందాయ్ 23.6 శాతం క్షీణించింది. దీనిని అధిగమించడానికి, ఆటో కంపెనీలు నగదు తగ్గింపులను అందిస్తుండగా, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా అందిస్తున్నాయి. టాటా మోటార్స్ వంటి కంపెనీలు కస్టమర్లకు ఉచిత బీమా, కార్ల కొనుగోలుపై పొడిగించిన వారంటీ ప్రయోజనాన్ని కూడా అందిస్తున్నాయి.
 

25

హ్యుందాయ్: రూ .15,000 నుండి రూ .1.50 లక్షల తగ్గింపు
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఆరాపై రూ .50వేల వరకు డిస్కౌంట్లను అందించడంతో పాటు నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది.
శాంట్రో, ఐ20 వంటి కార్లపై రూ .40,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
శాంట్రో, గ్రాండ్ ఐ 10 నియోస్, ఆరా సిఎన్‌జి వేరియంట్‌లపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లతో రూ .15,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
అత్యధికంగా అమ్ముడైన కార్లు క్రెటా, ఐ20 ఎన్ లైన్, వెన్యూ, వెర్నా, ఎలంట్రా పై కంపెనీ ఎలాంటి డిస్కౌంట్ అందించడం లేదు.
హ్యుందాయ్ ఇ-కార్ కోనా ఎలక్ట్రిక్ మీద రూ .1.50 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.
 

35

హోండా: రూ. 53,000 వరకు ప్రయోజనాలు
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ వివిధ కార్లపై రూ .18,000 నుండి రూ .53,000 వరకు తగ్గింపులను అందిస్తోంది.
హోండా అమేజ్ (2021) కొనుగోలుపై లాయల్టీ బోనస్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లతో పాటు రూ .18,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
మీరు హోండా సిటీ  జెడ్-జనరేషన్‌పై రూ. 53,505, Y- జనరేషన్‌పై రూ. 22,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
హోండా WRV పై రూ .40,000, జాజ్‌పై రూ .45,900 వరకు డిస్కౌంట్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది.
 

45

టాటా: క్యాష్ డిస్కౌంట్‌తో ఫ్రీ ఇన్షూరెన్స్
పండుగ సీజన్ ఆఫర్లలో భాగంగా టాటా నియాన్, టియాగో, టిగోర్, హారియర్ వంటి కార్లపై నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, ఉచిత బీమా, పొడిగించిన వారంటీని కంపెనీ అందిస్తోంది.
టాటా టియాగో  కార్లపై  రూ .23,000 నుండి రూ .28,000 వరకు డిస్కౌంట్‌లతో పాటు నగదు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి.  
టిగోర్  పెట్రోల్ వేరియంట్లపై 28,000 తగ్గింపు, టాటా నియాన్ పెట్రోల్ వేరియంట్లపై రూ .3,000, డీజిల్ వేరియంట్‌లపై రూ .20,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తుంది.
టాటా కంపెనీ  ఇ-కార్ టాటా నియాన్ ఈ‌వి పై రూ .13,000 తగ్గింపును అందిస్తోంది, ఎస్‌యూ‌వి హారియర్ కొనుగోలు చేస్తే రూ .15,000 ప్రయోజనం పొందవచ్చు.
 

55

మారుతి  ఎస్-క్రాస్ పై  బెస్ట్ తగ్గింపు:
పండుగ సీజన్‌లో అమ్మకాలను పెంచడానికి కంపెనీ బాలెనో మోడళ్లపై ఎక్స్ఛేంజ్ బోనస్, నగదు అండ్ కార్పొరేట్ డిస్కౌంట్‌లతో పాటు రూ .27,000 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. 
ప్రీమియం సెడాన్ సియాజ్ ఇంకా వార్షికోత్సవ ఎడిషన్‌లను కొనుగోలు చేస్తే 30,000 డిస్కౌంట్  పొందవచ్చు. 
మీరు ఇగ్నిస్ మోడళ్లపై రూ .12,500 నుండి రూ .17,500 వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. 
కంపెనీ ఎస్- క్రాస్ అలాగే వార్షికోత్సవ ఎడిషన్‌లో 30,000 నుండి 45,000 వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. 

click me!

Recommended Stories