లగ్జరీ, పర్ఫర్మెంస్ తో టొయోటా ఫార్చ్యూనర్ సరికొత్త వేరియంట్‌.. ఈ ఎస్‌యూ‌వి స్పెషాలిటీ ఎంటో తెలుసా..?

First Published | Oct 7, 2021, 7:06 PM IST

టయోటా కిర్లోస్కర్ మోటార్  ఫ్లాగ్ షిప్ ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూ‌వి కొత్త 4X4 వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ సంవత్సరం జనవరిలో ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ  ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో పాటు 4X2 డీజిల్ వెర్షన్‌ ని లాంచ్ చేశారు. ఫార్చ్యూనర్ లెజెండర్ 4X4 వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 42.33 లక్షలు.

ఫార్చ్యూనర్ లెజెండ్ 4X4 మోడల్ పర్ఫర్మెంస్, లగ్జరీ కోరుకునే వారిని సంతృప్తిపరుస్తుంది అని సంస్థ హామీ ఇచ్చింది. ఈ కారు ప్రత్యేకంగా రూపొందించిన హెడ్‌ల్యాంప్‌లు, స్ప్లిట్ క్వాడ్ ఎల్‌ఈడీ, వాటర్ ఫాల్ ఎల్‌ఈ‌డి లైన్ గైడ్ సిగ్నేచర్ ఇంకా మరెన్నో పొందుతుంది. 
 

ఇంజిన్ అండ్ పవర్:

ఫార్చ్యూనర్ లెజెండ్ 4X4 ఎస్‌యూ‌వి 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 204 పిఎస్ పవర్, 500 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అందించారు. 


ఇంటీరియర్, ఫీచర్లు

ఫార్చ్యూనర్ లెజెండ్ 4X4 ఇంటీరియర్‌లో బ్లాక్ అండ్ మెరూన్‌లో డ్యూయల్ టోన్ కలర్ థీమ్, కాంట్రాస్ట్ స్టిచింగ్ తో  స్టీరింగ్ వీల్ ఇంకా కన్సోల్ బాక్స్, యాంబియంట్ లైటింగ్, వెనుక ప్రయాణికుల కోసం యూ‌ఎస్‌బి పోర్ట్ ఇచ్చారు. ఇవి కాకుండా ఫార్చ్యూనర్ లెజెండర్ 4X4 పవర్ బ్యాక్ డోర్ కోసం కిక్ సెన్సార్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లను కూడా అందించింది.

లుక్ ఇంకా డిజైన్

ఈ ఎస్‌యూ‌వి  ఎఎక్స్టీరియర్ ఫీచర్స్ గురించి మాట్లాడితే దీనికి కాటమరన్ స్టైల్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, పియానో బ్లాక్ యాక్సెంట్స్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, 18-అంగుళాల మెషిన్ కట్ ఫినిష్ అల్లాయ్‌లతో షార్ప్, స్లీక్ ఫ్రంట్ గ్రిల్ ఇచ్చారు.

Latest Videos

click me!